Latest Updates
-
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే..
హెల్తీ బ్రేక్ ఫాస్ట్ : పెసర మొలకల దోస.. షుగర్ కంట్రోల్ మరియు బరువు తగ్గిస్తుంది..!
పెసర మొలకలు దోస: మన రోజువారీ జీవితంలో ఆహారాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. శరీరాన్ని ఆరోగ్యంగా, దృఢంగా ఉంచే ఈ ఆహారాలలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండకుండా, మన శరీరానికి శక్తిని ఇస్తాయి. మనం తినే ఆహారంలో పోషకాల కొరత ఉంటే, శరీరం ఖచ్చితంగా లోపాలను ఎదుర్కొంటుంది.
ఈ లోపాలు మన శరీరానికి చేరకుండా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంపై అదనపు శ్రద్ధ పెట్టడం అవసరం. ఆహారంలో పాలు, పండ్లు, ఆకు కూరలు, మొలకలు మరియు పప్పులు ఉన్నాయో లేదో తనిఖీ చేయడం చాలా ముఖ్యం. ఆయిల్ ఫుడ్స్ మరియు రెడీమేడ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మన శరీరం కచ్చితంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది.

ఇంతకు ముందు చెప్పినట్లుగా, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో పాలు, పండ్లతో పాటు మొలకలు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి మీరు వాటిని క్రమం తప్పకుండా తినగలిగేలా మొలకెత్తిన పప్పుల నుండి స్నాక్స్ ఎలా తయారు చేయాలి అనే మీ ప్రశ్నకు ఇక్కడ సమాధానం ఉంది.
నేటి కథనంలో, ప్రొటీన్లు మరియు విటమిన్లు పుష్కలంగా ఉండే మొలకల
దోసను రుచి చూడండి. అత్యంత పోషకమైనది మొలకలలో కేలరీలు తక్కువ, ఫైబర్
అధికంగా ఉంటుంది. ప్రొటీన్‌తో
మొలకలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడంలో సహాయపడతాయి, ఇది
బరువు తగ్గాలనుకునే వారికి మరింత సహాయపడుతుంది. ఎక్కువ శ్రమ లేకుండా
త్వరగా తయారు చేసుకోగలిగే మొలకల దోస తయారీ విధానాన్ని క్రింద
అందించాము.
పరిమాణం: 4
*తయారీ సమయం: 1/2 గంట
*వంట సమయం: 1/2 గంట
కావాల్సిన పదార్థాలు
*పెసరపప్పు 250 గ్రాములు(మొలకకట్టినది)
*అల్లం - 1 ముక్క
*కొద్దిగా జీలకర్ర
*ఉప్పు - రుచికి సరిపడా
*పచ్చిమిర్చి - 4
*కొత్తిమీర - కొద్దిగా
*నూనె - 50 గ్రా
*ఉల్లిపాయలు: 2(సన్నగా కట్ చేసుకోవాలి)
తయారు చేసే విధానం
1. ముందుగా పేసర పప్పును నీళ్లలో 5 గంటలు నానబెట్టాలి.తర్వాత నీరు
వంపేసి, పల్చటి కాటన్ బట్టలో వేసి ముడి కట్టి రాత్రంతా అలాగే
పెట్టాలి.
2. మరుసటి రోజు ఉదయం మొలకలను మూట విప్పి వాటిని మిక్సీలో వేసి అందులో
కొద్దిగా పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర వేసి బాగా మెత్తగా దోస పిండిలా
చేసుకోవాలి.
3.చివరిగా దోస పిండిలో ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి
ముక్కులు, కొత్తిమీర తరుగు వేసి, మొత్తం మిశ్రమంను బాగా
కలుపుకోవాలి
4. అంతలోపు, తవాను వేడి చేసి, దోస పిండిపోసి దోసెలా పాన్ మొత్తం
స్పెడ్ చేసి రెండు వైపులా దోరగా వేయించుకోండి.
5. అంతే రుచికరమైన పెసరపప్పు మొలకల దోసె రుచి చూడటానికి సిద్ధంగా
ఉంది. ఈ దోసెను, అల్లం చట్నీ గ్రీన్ చట్నీతో ఆస్వాదించడం వల్ల రుచి
అద్భుతంగా ఉంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
