Latest Updates
-
అద్దిరిపోయే రుచితో కీమా చికెన్ సల్నా.. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు! -
మిగిలిపోయిన అన్నంతో అద్భుతమైన టమాటా వెల్లుల్లి రైస్..బ్యాచిలర్స్ కు పండగే పండగ -
ముల్లంగి ఆకులతో ఇలా పకోడీ చేసి చూడండి..లొట్టలేసుకుంటూ తింటారు! -
భారతదేశంలో తొలి సూర్యోదయం ఎక్కడ కనిపిస్తుందో తెలుసా? -
ఉల్లి, వెల్లుల్లి లేకుండానే అద్భుతమైన రుచి..హిమాచల్ ప్రదేశ్ స్పెషల్ మటర్ పనీర్ మీ ఇంట్లోనే చేసుకోండిలా.. -
పొట్ట ఉబ్బరం, గ్యాస్ట్రిక్ నొప్పి ఉన్నప్పుడు.. ఇవి తీసుకుంటే చిటికెలో రిలీఫ్ -
రెస్టారెంట్ స్టైల్ చికెన్ వెల్లుల్లి రైస్.. తక్కువ సమయంలోనే అద్భుతమైన రుచి -
టిక్కెట్ లేకుండా ప్రయాణం..చెకింగ్ కి భయపడి డోర్ లాక్..కదులుతున్న రైలు బయట వేలాడిన టీటీఈ! -
20 నిమిషాల్లో చక్కెర, ప్రిజర్వేటివ్స్ లేని పీనట్ బటర్..ప్రోటీన్, పోషకాలతో నిండిన ఆరోగ్యకరమైన అల్పాహారం -
ఐరన్ లోపం, జుట్టు, చర్మ సమస్యలకు మేలు చేసే మునగ సూప్.. ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా!
ఆరోగ్యానికి మేలు చేసే మునగకాయ పచ్చడి ..ఇలా చేస్తే ఏడాది అయినా అస్సలు పాడవదు!
మన తెలుగువారి భోజనం ఊరగాయ లేకుండా అస్సలు పూర్తి కాదు. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని, కమ్మటి పచ్చడి కలుపుకుని తింటే ఆ మజాయే వేరు. అయితే ఎప్పుడూ ఆవకాయ, టమాటా, నిమ్మకాయ పచ్చళ్లే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగకాయ ఊరగాయ ఓ సారి ట్రై చేయండి.
మునగకాయలలో ఉండే పోషకాలు ఈ పచ్చడి ద్వారా మనకు అందుతాయి. దీన్ని తయారు చేయడం కూడా చాలా సులభం. నోరూరించే మునగకాయ ఊరగాయను పర్ఫెక్ట్ గా ఎలా చేయాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
లేత మునగకాయలు - 500 గ్రాములు
ఆవ నూనె- 1 కప్పు (సుమారు 200 మి.లీ)
ఆవాలు- 3 టీస్పూన్లు
సోంపు - 2 టీస్పూన్లు
మెంతుల పొడి - 1 టీస్పూన్
కలోంజి (నల్ల జీలకర్ర) - 1 టీస్పూన్
పసుపు - ఒకటిన్నర టీస్పూన్లు
కారం పొడి (పచ్చళ్ల కారం) - 2 టీస్పూన్లు
ఆమ్ చూర్ పౌడర్ లేదా వెనిగర్ - 3 టీస్పూన్లు
ఇంగువ - అర టీస్పూన్
ఉప్పు - రెండున్నర టీస్పూన్లు
తయారీ విధానం
-ముందుగా తాజాగా ఉన్న మునగకాయలను తీసుకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడవాలి. ఆ తర్వాత వాటిని 1.5 నుండి 2 అంగుళాల పొడవున్న ముక్కలుగా కట్ చేసుకుని, పైన ఉన్న గట్టి తొక్కను (పీచును) తేలికగా తీసేయాలి.
-ఇప్పుడు ఒక గిన్నెలో సగం వరకు నీళ్లు తీసుకుని మరిగించాలి. ఆ గిన్నెపై ఒక చిల్లుల జల్లెడ ఉంచి, అందులో మునగకాయ ముక్కలను వేయండి. మూతపెట్టి కేవలం 4-5 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించాలి. ముక్క మరీ మెత్తబడకూడదు, కొద్దిగా మృదువుగా మారితే చాలు.
-ఆవిరి మీద ఉడికిన మునగకాయ ముక్కలను ఒక పొడి కాటన్ వస్త్రంపై పరచి, 2-3 గంటల పాటు ఎండలో లేదా ఫ్యాన్ గాలికి బాగా ఆరబెట్టాలి. పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ముక్కల్లో తడి అస్సలు ఉండకూడదు.
-ఒక మందపాటి కడాయిలో ఆవ నూనె పోసి బాగా వేడి చేయండి. నూనె నుండి పొగలు రావడం మొదలవ్వగానే స్టవ్ ఆపేయండి. ఇలా చేస్తే ఆవనూనె పచ్చి వాసన పోతుంది. నూనె గోరువెచ్చగా అయ్యాక అందులో కొద్దిగా ఇంగువ వేసి కలపండి.
-ఇప్పుడు ఒక పెద్ద పొడి గిన్నె తీసుకుని అందులో ఆరబెట్టిన మునగకాయ ముక్కలను వేయండి. అందులోనే దంచిన ఆవాలు, సోంపు, మెంతి పొడి, కలోంజి, పసుపు, కారం, ఆమ్ చూర్ పౌడర్, ఉప్పు వేసి ముక్కలకు పట్టేలా బాగా కలపండి.
-చివరగా, సిద్ధం చేసుకున్న గోరువెచ్చని నూనెను ఈ మునగకాయల మిశ్రమంపై పోసి గరిటెతో అడుగునుండి నెమ్మదిగా కలపండి. ప్రతి ముక్కకు మసాలా, నూనె బాగా పట్టాలి.
-అంతే ఎంతో రుచికరమైన మునగకాయ ఊరగాయ సిద్ధం. దీన్ని ఒక పొడి గాజు సీసాలో భద్రపరచుకుని, ఒక వారం రోజుల పాటు రోజూ కాసేపు ఎండలో ఉంచితే ముక్క ఊరి మసాలాలన్నీ పట్టి రుచి అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
