Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
రంజాన్‌లో మాసంలో మటన్ హలీమ్ వేరీ స్పెషల్: ఘుమఘుమలాడిస్తూ..నోరూరించే మటన్ హలీమ్ ఒక్కసారైనా టేస్ట్ చూడాల్సిందే.
Mattun Haleem Recipe: రంజాన్ ఉపవాస మాసం మాత్రమే కాదు, ఈ మాసంలో అనేక రుచికరమైన మరియు నోరూరించే వంటకాలు కూడా తయారుచేస్తారు. నాన్ వెజ్ లో చాలా వంటలు తయారు చేస్తారు. అటువంటి పాత మరియు సాంప్రదాయ వంటకంలో హలీమ్ ఒకటి.
ఈ వంటకం రంజాన్‌లో రాత్రి భోజనం మరియు సెహ్రీ సమయంలో చాలా ఉత్సాహంగా తింటారు, అయితే ఈ వంటకం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. హలీమ్ గురించి తెలియని లేదా రుచి చూడని వారిలో మీరు కూడా ఉన్నారు, కాబట్టి, ఈ రోజు మీకోసం మటన్ హలీంను పరిచయం చేస్తున్నాం.

హలీమ్ అంటే ఏమిటి
హరీస్ అనే ప్రసిద్ధ అరబిక్ వంటకం నుండి హలీమ్ ఉద్భవించింది...ఇది
భారతదేశంలోని నిజాం సైన్యానికి చెందిన అరబ్ సైనికులు హైదరాబాద్
నగరానికి పరిచయం చేయబడింది.ఇది మాంసం మరియు తృణధాన్యాల గంజితో తయారు
చేయబడింది. ఇది కనిపించేంత రుచికరమైనది . కానీ దీన్ని తయారు చేయడం
అస్సలు సులభం కాదు. తక్కువ చెక్క మంటపై గంటల తరబడి ఉడికించాలి.
పూర్తిగా సిద్ధం కావడానికి సాధారణంగా 10 నుండి 12 గంటలు పడుతుంది.
దీన్ని నిరంతరం కలబెడుతుండాలి, అప్పుడే రుచికరమైన హలీమ్ రెడీ
అవుతుంది.. అయితే ఈ రోజుల్లో ప్రెషర్ కుక్కర్లో త్వరగా
తయారవుతుంది.. మనం ప్రెజర్ కుక్కర్ లో సులభంగా తయారుచేసుకోగల మటన్
హలీగురించి తెలుసుకుందాం. మీరు కూడా ట్రై చేసి, రుచి చూసీ మీ
అభిప్రాయన్ని మాతో పంచుకోండి.
కావలసిన పదార్థాలు
మటన్ : 1kg
గోధుమ రవ్వ: 1/2kg
చనా పప్పు(శెనగపప్పు) ; 1/2cup
పెసర పప్పు; 1/2cup
మూంగ్ పప్పు; 1/2cup
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 1tbsp
ఎర్ర మిరపకాయ పొడి: 3tsp
పసుపు పొడి: 3tsp
ధనియాల పొడి: 3tsp
పెద్ద ఏలకులు: 3
తరిగిన ఉల్లిపాయలు: 5
జీలకర్ర: 1 tsp
నల్ల మిరియాలు : 8 నుండి 10
గరం మసాలా పొడి: 1tsp
పుదీనా ఆకులు: అవసరం మేరకు
కొత్తిమీర తరుగు: అవసరం మేరకు
నిమ్మకాయ
ఉప్పు: రుచికి సరిపడా
ఒక కప్పు నూనె

హలీమ్ తయారుచేయు విధానం:
1. హలీమ్ చేయడానికి, రవ్వని(పెద్ద రవ్వ) నీటిలో 8 గంటలు
నానబెట్టండి.
2. పప్పులన్నీ మరో పాత్రలో 4 నుంచి 5 గంటల పాటు నానబెట్టాలి.
3. ప్రెజర్ కుక్కర్‌ను గ్యాస్‌పై ఉంచి, నానబెట్టిన
పప్పు మరియు గోధుమరవ్వను వేయండి.
4. తర్వాత అందులోనే కాస్త నీళ్లు, ఉప్పు వేసి కుక్కర్లో
మూతపెట్టాలి.
5. 5 నుంచి 6 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి కాస్త చల్లారాక
కలపాలి.
6. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో మటన్, కొంచెం నీళ్ళు, ఉప్పు,
ఎర్ర కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, లవంగం, యాలకులు వేసి మూడు
విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.
7. ఇప్పుడు ఒక పెద్ద బాణలిలో నూనె వేసి, ఉల్లిపాయను ముక్కలు వేసి, లేత
గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి.
8. అదే నూనెలో మసాలాలు మరియు సిద్ధం చేసిన మటన్ వేసి 10 నుండి 15
నిమిషాలు వేయించాలి.
9. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, నీళ్లు పోసి మూత పెట్టాలి.
10. ఈ మిశ్రమం మొతం 10 నిమిషాలు తక్కువ మంటపై ఉడికించాలి.
11. 10 నిముషాల తర్వాత స్టౌ ఆఫ్ చేసి, ఆవిరి పోయాక మూత తీసి రుచి
చూసి, ఉప్పుకారసం సరిచూసుకోవాలి.
12. గరం మసాలా పొడి చల్లి, నిమ్మకాయ చాట్ మసాలా, ఉల్లిపాయ మరియు పచ్చి
కొత్తిమీర వేసి వేడిగా సర్వ్ చేయాలి. అంతే మటన్ హలీమ్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications