Latest Updates
-
మైదా లేకుండా హెల్తీగా..సూపర్ టేస్టీ చీజ్ పరాఠా..ఎలా చేసుకోవాలంటే.. -
Viral Video: ఒక్క షాట్ కి ఎంత?..విదేశీ మహిళా టూరిస్ట్ ని వేధించిన కుర్రాళ్లు..వీడియో చూడండి -
శరీరంలో విటమిన్ల లోపాన్ని పోగొట్టే పచ్చి అరటికాయ పూరీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
తిన్న కొద్ది తినాలనిపించే రాయలసీమ వెల్లుల్లి కారం..ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ.. -
అక్టోబర్ నెలలో పుట్టిన అమ్మాయిల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా? -
కేవలం 10 నిమిషాల్లో రవ్వ బన్ దోస,స్పెషల్ టమాటా చట్నీ.. ఈ రహస్యం తెలిస్తే రోజూ ఇదే కావాలంటారు! -
అక్టోబర్ 3న భయంకరమైన గ్రహం నక్షత్ర మార్పు.. ఈ మూడు రాశుల వారికి కష్టాల కడలి.! -
రోజుకు ఎన్ని కప్పుల టీ తాగొచ్చు? -
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా
డీప్ ఫ్రై లేకుండానే KFC స్టైల్ పాప్ కార్న్ చికెన్.. మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా
KFC చికెన్ అనగానే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నోరూరిపోతుంది. ముఖ్యంగా అందులో దొరికే కరకరలాడే పాప్ కార్న్ చికెన్ రుచి అద్భుతంగా ఉంటుంది. అయితే బయట దొరికే చికెన్‌ను నూనెలో డీప్ ఫ్రై చేయడం వల్ల క్యాలరీలు, చెడు కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారు లేదా ఫిట్ నెస్ పై శ్రద్ధ వహించేవారు ఈ కారణంతోనే ఆ రుచికి దూరంగా ఉంటారు. కానీ ఇకపై ఆ చింత లేకుండా తక్కువ క్యాలరీలతో, జిమ్ చేసే వారికి కూడా సరిపోయేలా హై ప్రొటీన్ క్రిస్పీ KFC స్టైల్ పాప్ కార్న్ చికెన్ మీ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

KFC స్టైల్ పాప్ కార్న్ చికెన్ తయారీకి కావలసిన పదార్థాలు
బోన్ లెస్, స్కిన్ లెస్ చికెన్ థై ముక్కలు-
200 గ్రాములు
వెల్లుల్లి పొడి- 1 టీస్పూన్
ఉల్లిపాయ పొడి- అర టీస్పూన్
పాప్రికా- 1 టీస్పూన్
కాయెన్ పెప్పర్ - అర టీస్పూన్
తెల్ల మిరియాల పొడి, నల్ల మిరియాల పొడి - అర టీస్పూన్ చొప్పున
మిక్స్డ్ హెర్బ్స్ - అర టీస్పూన్
ఉప్పు - అర టీస్పూన్
బేకింగ్ పౌడర్ - కొద్దిగా
కార్న్‌ఫ్లోర్ (మొక్కజొన్న పిండి) - 60 గ్రాములు
KFC స్టైల్ పాప్ కార్న్ చికెన్ తయారీ విధానం
ముందుగా శుభ్రం చేసుకున్న చిన్న చిన్న సైజు చికెన్ ముక్కలను ఒక పెద్ద బౌల్ లో వేసుకోండి. అందులో వెల్లుల్లి పొడి, ఉల్లిపాయ పొడి, పాప్రికా, కాయెన్, మిరియాల పొడులు, ఉప్పు, మిక్స్డ్ హెర్బ్స్, బేకింగ్ పౌడర్, కార్న్‌ఫ్లోర్ వేసి బాగా కలపండి. ప్రతి చికెన్ ముక్కకు ఈ మసాలా పౌడర్ బాగా కోట్ అయ్యేలా చూసుకోండి. ఇప్పుడు వాటిపై కొద్దిగా ఆయిల్ స్ప్రే చేయండి.
ఓవెన్ ను ముందుగా 200°C దగ్గర వేడి చేసి, అందులో ఈ చికెన్ ముక్కలను ట్రేపై ఉంచి 15 నుంచి 18 నిమిషాల పాటు బేక్ చేయండి. బంగారు వర్ణంలోకి మారి కరకరలాడే వరకు ఉంచండి.
ఒకవేళ మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఉంటే, అందులో 200°C ఉష్ణోగ్రత దగ్గర 10-12 నిమిషాల పాటు ఫ్రై చేస్తే చాలు. నూనె లేకుండానే అద్భుతమైన క్రిస్పీ చికెన్ సిద్ధమవుతుంది.
సాస్ తయారీ కోసం ఒక చిన్న గిన్నెలో 60 గ్రాముల లైట్ మయోనైస్, 60 గ్రాముల గ్రీక్ యోగర్ట్, వెల్లుల్లి పొడి, 1 టీస్పూన్ తేనె, ఉప్పు వేసి బాగా కలపండి. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోండి. ఈ తియ్యటి, పుల్లటి క్రీమీ సాస్ పాప్‌కార్న్ చికెన్ కు అద్భుతమైన కాంబినేషన్.
పోషక విలువలు (ఒక సర్వింగ్ కు)
క్యాలరీలు: 316 క్యాలరీలు (తక్కువ క్యాలరీల స్నాక్)
ప్రొటీన్: 32 గ్రాములు (కండరాల బలానికి, నిర్మాణానికి అత్యుత్తమం)
కార్బోహైడ్రేట్లు: 14.5 గ్రాములు
కొవ్వు పదార్థాలు: 16 గ్రాములు
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
