Latest Updates
-
ఎండాకాలంలో పచ్చి ఉల్లిపాయ.. ఈ లాభాలు తెలిస్తే రోజూ వదిలిపెట్టరు! -
ఎండల వేడిని తట్టుకోవాలా? ఈ చలవ చేసే ఆహారాలు మీకోసం! -
ఐరన్, కాల్షియంల గని..మాస్టర్ చెఫ్ స్టైల్ మునగకాయ నిల్వ పచ్చడి..అమృతం టేస్ట్ అందే ఇదేనేమో! -
మేష సంక్రాంతి వేళ ఈ పండుగలు ఎందుకు ప్రత్యేకం? ఆచారాల వెనుక ఉన్న అసలు రహస్యాలివే -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుత యోగం..! - సోమవారం, 13 ఏప్రిల్ 2026 -
16 ఏళ్లుగా విడిపోయినా వదలని బంధం.. భర్తకు సుప్రీంకోర్టు షాకింగ్ ఆదేశాలు! -
ఏప్రిల్ ఎండలు మండిపోతున్నాయా? ఈ చిట్కాలతో వడదెబ్బకు చెక్ పెట్టండి -
విరాట్ కోహ్లీ ఇచ్చిన ఆ చిన్న కానుక వైభవ్ కెరీర్‌నే మార్చేస్తుందా? -
ఎండల తీవ్రత నుంచి బయటపడాలా? ఈ పానీయాలతో శరీరాన్ని చల్లబరుచుకోండి -
మేష సంక్రాంతి 2026: ఈ ముహూర్తంలో పూజ చేస్తే అదృష్టం మీదేనా?
పప్పు నానబెట్టే పనే లేదు..రాత్రి మిగిలిన అన్నంతో 10 నిమిషాల్లో దూదిలాంటి స్పాంజీ ఇడ్లీలు!
మన ఇళ్లలో తరచుగా వండిన అన్నం మిగిలిపోవడం చాలా సహజం. అలాంటప్పుడు ఆ అన్నాన్ని పారేయడానికి మనసు రాదు, అలా అని చల్లారిన అన్నాన్ని తినడానికీ ఇష్టపడం. మరి ఆ మిగిలిపోయిన అన్నంతో నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే మల్లెపూవుల్లాంటి మెత్తటి ఇడ్లీలు తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా?
సాధారణంగా ఇడ్లీలు చేయాలంటే పప్పు నానబెట్టాలి, రుబ్బాలి, రాత్రంతా పులియబెట్టాలి.. ఇదంతా పెద్ద తతంగం. కానీ ఈ పద్ధతిలో గంటల తరబడి పులియబెట్టాల్సిన పనే లేదు. అప్పటికప్పుడు నిమిషాల్లో వేడివేడి, దూది లాంటి స్పాంజీ ఇడ్లీలను మీ కుటుంబ సభ్యులకు వడ్డించవచ్చు.
మిగిలిపోయిన అన్నంతో ఇడ్లీ తయారీకి కావలసిన పదార్థాలు
మిగిలిపోయిన అన్నం - 1 కప్పు
బొంబాయి రవ్వ- అర కప్పు
తాజా పెరుగు - అర కప్పు
నీళ్లు - సరిపడా
ఉప్పు - మీ రుచికి తగినంత
వంట సోడా - అర టీస్పూన్
వంటనూనె - కొద్దిగా
మిగిలిపోయిన అన్నంతో ఇడ్లీ తయారీ విధానం
-ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మిగిలిపోయిన అన్నాన్ని వేయండి. దానికి కొద్దిగా నీళ్లు జతచేసి, ఎక్కడా ఉండలు లేకుండా చాలా మెత్తని పేస్ట్ లా రుబ్బుకోవాలి.
-ఇప్పుడు ఈ మెత్తటి అన్నం పేస్ట్‌ను ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకోండి. అందులో ముందుగా తీసుకున్న అర కప్పు బొంబాయి రవ్వ, అర కప్పు పెరుగు వేసి అన్నీ బాగా కలిసేలా గరిటతో కలుపుకోవాలి.
-పిండి మరీ చిక్కగా అనిపిస్తే, సాధారణ ఇడ్లీ పిండి ఏ చిక్కదనంతో ఉంటుందో చూసుకుని, దానికి తగ్గట్లుగా కొద్దిగా నీళ్లు కలపండి. మీరు పిండి కలుపుకునేటప్పుడు కొద్దిగా అటుకులు పొడి చేసి కలిపితే ఇడ్లీలు మరింత మృదువుగా, స్పాంజీలా వస్తాయి.
-ఇప్పుడు పిండిలో మీ రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని మూతపెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచండి. ఇలా చేయడం వల్ల బొంబాయి రవ్వ నీటిని, పెరుగును పీల్చుకుని చక్కగా నానుతుంది.
-ఇడ్లీలు వేయడానికి సరిగ్గా ముందు, పిండిలో బేకింగ్ సోడా లేదా ఈనో వేసి ఒకే దిశలో సున్నితంగా కలపండి. పిండి బుడగల్లా పొంగుతూ తేలికగా మారుతుంది.
-ఇడ్లీ అచ్చులకు (ప్లేట్లకు) కొద్దిగా నూనె లేదా నెయ్యి రాసి, ఈ పిండిని కొద్దికొద్దిగా అందులో పోయండి.
-ఇడ్లీ పాత్రలో లేదా స్టీమర్ లో కొద్దిగా నీళ్లు పోసి, ఈ ప్లేట్లను పెట్టి మూతపెట్టండి. మీడియం మంట మీద సుమారు 10 నుంచి 12 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించండి. ఆ తర్వాత స్టవ్ ఆపేసి, వేడి మీద వెంటనే తీయకుండా ఒక రెండు నిమిషాలు ఆగి ఇడ్లీలను గరిటతో బయటకు తీయండి.
-అంతే వేడివేడి ఇడ్లీలు రెడీ. వీటిని కమ్మటి కొబ్బరి పల్లి చట్నీ లేదా వేడివేడి సాంబార్ తో తింటుంటే ఆహా అనాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications

