Latest Updates
-
రిలేషన్షిప్లో ఉన్నారా.. మీపై ఉన్నది ప్రేమా లేక వ్యామోహమా.. ఎలా తెలుసుకోవాలంటే.! -
టేస్టీ మంచూరియానే కాదు, కరకరలాడే అప్పాలు సైతం రెడీ.. క్యాబేజ్‌తో ఇలా ఈజీగా చేసేయండి.! -
ఈ సారి రెండు తేదీల్లో వరలక్ష్మీ వ్రతం.. మహిళలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన వ్రత ప్రాముఖ్యత.! -
ప్రెగ్నెన్సీలో వీటి లోపంతోనే విపరీతమైన క్రేవింగ్స్.. వీటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే.! -
కుబేర మొక్క.. మనీ ప్లాంట్ అనుకుంటే పొరపాటే.. ఇది మీ ఇంట్లో ఉంటే కనకవర్షమే.! -
పైన కరకరలాడుతూ, లోపల జ్యూసీగా.. పొరలు పొరలుగా వచ్చే బెల్లం ఖాజా మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
కరకరలాడే చికెన్ ముక్కలు, ఘాటైన మసాలా.. చెట్టినాడ్ చికెన్ పాప్‌కార్న్‌తో ఈవెనింగ్ సూపర్! -
పోషకాల గని ఈ బీట్ రూట్ ఉప్మా..మజ్జిగతో కలిపి ఇలా చేస్తే టేస్ట్ కేక! -
చుండ్రు వల్ల జుట్టు రాలిపోతోందా? అయితే మీరు తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు -
గోవా వెళ్లకుండానే ఆ రుచిని ఎంజాయ్ చేయండి.. నోరూరించే గోవా చికెన్ మసాలా తయారీ విధానం ఇదే!
విటమిన్లు, ఐరన్ పుష్కలం..చక్కెర,బెల్లం లేకుండానే సూపర్ టేస్టీ డ్రై ఫ్రూట్ రోల్ చేసుకోండిలా
ఈ రోజుల్లో పంచదారతో చేసిన స్వీట్స్ తినాలంటే చాలామంది భయపడుతున్నారు. ఆరోగ్య స్పృహ పెరగడంతో హెల్తీ స్వీట్స్ కోసం ఖరీదైన స్వీట్ షాపుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే, ఇకపై మీరు అలాంటి షాపులకు వెళ్లాల్సిన అవసరం అస్సలు లేదు. ఇంట్లో ఉండే తాజా డ్రై ఫ్రూట్స్ తో ఎంతో రిచ్ గా, కమ్మగా ఉండే డ్రై ఫ్రూట్ రోల్ ని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇందులో ఎలాంటి పంచదార, బెల్లం వాడరు. కేవలం ఖర్జూరంలోని సహజ సిద్ధమైన తీపితోనే దీన్ని తయారు చేస్తారు కాబట్టి ఇది ఆరోగ్యానికి వంద శాతం మేలు చేస్తుంది.

డ్రై ఫ్రూట్ రోల్ తయారీకి కావలసిన పదార్థాలు
నెయ్యి లేదా వెన్న- 1 లేదా 2 టేబుల్ స్పూన్లు
పెద్ద ఖర్జూరాలు- 8
వాల్ నట్స్ - పావు కప్పు
బాదం పప్పులు- పావు కప్పు
పిస్తా పప్పులు - పావు కప్పు
గుమ్మడి గింజలు - 2 టేబుల్ స్పూన్లు
నువ్వులు - 2 టేబుల్ స్పూన్లు
ఎండు కొబ్బరి తురుము - కొద్దిగా
డ్రై ఫ్రూట్ రోల్ తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి, ఒక మందపాటి పాన్ పెట్టుకుని అందులో కొద్దిగా వెన్న లేదా నెయ్యి వేసి వేడి చేయాలి.
-నెయ్యి కరిగిన తర్వాత, అందులో గింజలు తీసేసిన ఖర్జూరాలను వేయాలి. మంటను సిమ్ లో ఉంచి ఖర్జూరాలు బాగా మెత్తబడి, పేస్ట్ లా మారే వరకు వేయించుకోవాలి.
-ఇప్పుడు ఆ ఖర్జూరాల మిశ్రమంలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న వాల్ నట్స్, బాదం, పిస్తా ముక్కలతో పాటు గుమ్మడి గింజలు, నువ్వులు వేయాలి. ఈ మిశ్రమం మొత్తాన్ని గరిటెతో సమానంగా కలుపుతూ, సన్నని మంటపై దోరగా వేయించాలి. గింజల్లోని పచ్చిదనం పోయి, మంచి సువాసన వచ్చే వరకు రోస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి, ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టి కొద్దిగా చల్లారనివ్వాలి. మరీ పూర్తిగా చల్లారకూడదు, చేత్తో పట్టుకునేంత గోరువెచ్చగా ఉండాలి.
-ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకుని, తయారు చేసుకున్న గోరువెచ్చని డ్రై ఫ్రూట్ మిశ్రమాన్ని దానిపై వేయాలి. చేతులతో గట్టిగా నొక్కుతూ, లోపల ఎలాంటి గ్యాప్ లేకుండా సిలిండర్ ఆకారంలో (పొడవాటి రోల్ లాగా) షేప్ చేసుకోవాలి.
-ఈ రోల్ పైన ముందుగా సిద్ధం చేసుకున్న ఎండు కొబ్బరి తురుమును చల్లాలి. రోల్ ను బటర్ పేపర్ పై అటూ ఇటూ తిప్పితే కొబ్బరి తురుము దానికి అందంగా, సమనంగా అతుక్కుంటుంది.
-ఆ తర్వాత అదే బటర్ పేపర్ తో రోల్ ను గాలి చొరబడకుండా గట్టిగా చుట్టేసి ఫ్రిజ్ లో సుమారు గంట నుండి రెండు గంటల పాటు ఉంచాలి. ఇలా చేయడం వల్ల రోల్ గట్టిపడుతుంది.
-చివరగా ఫ్రిజ్ నుండి తీసి, బటర్ పేపర్ తొలగించి చాకుతో గుండ్రటి స్లైసెస్ లాగా కట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన డ్రై ఫ్రూట్ రోల్ రెడీ.
-దీన్ని చల్లగా ఉన్నప్పుడే సర్వ్ చేస్తే ఆ రుచే వేరు. ఇందులో వాడిన డ్రై ఫ్రూట్స్ వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, మంచి కొవ్వులు, ఐరన్ పుష్కలంగా అందుతాయి. పిల్లల స్నాక్స్ బాక్స్‌లోకి కూడా ఇది బెస్ట్ ఆప్షన్.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications