Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
ఆంధ్రా స్టైల్ రెడ్ చికెన్ మసాలా -స్పైసీ అండ్ టేస్టీ
మీరు వివిధ రకాల వైరైటీ రుచులను తయారు చేయడానికి చికెన్ ఒక అద్భుతమైన ఆహారపదార్థం. ఎందుకంటే చికెన్ తో వివిధ రకాల వంటలను వివిధ స్టైల్స్ లో తయారుచేయవచ్చు. చికెన్ గ్రిల్ చేయవచ్చు లేదా బేక్ చేయవచ్చు, గ్రేవీ లేదా ఫ్రై ఇలా వివిధ రకాలుగా తయారుచేయవచ్చు. ప్రతి చికెన్ వంటా చాలా అద్భుతమైన రుచి కలిగి ఉంటుంది. కాబట్టి, ఈ రోజు మనం ఒక సింపుల్, స్పైసీ మరియు నోరూరించే చికెన్ రిసిపిని అందులోనే ఆంధ్రా స్టైల్ స్పైసీ స్టైల్లో ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.
ఈ ఆంధ్రా స్టైల్ రెడ్ చికెన్ మసాలా రిసిపి చాలా రిచ్ గా, స్పైసీగా, క్రీమీగా మరియు గ్రేవీని తయారుచేస్తారు. కొన్ని మసాలాదినుసులను ఈ వంటకు ఉపయోగించడం వల్ల అద్భుతమైన టేస్ట్ ను అంధిస్తుంది. ఇది రోటీ, నాన్స్ కు అద్భుతంగా ఉంటుంది. ఈ వీకెండ్ లో మీరు పార్టీకి ప్లాన్ చేసుకుంటున్నట్లైతే, ఆంధ్రా స్టైల్ రెడ్ చికెన్ మసాలాను మీ మెనులో చేర్చుకోండి..

కావల్సిన పదార్థాలు:
చికెన్: 1 ఒక కోడి మొత్తం (కర్రీ కట్ చేసినట్లు ముక్కలుగా కట్ చేయాలి)
వెల్లుల్లి మరియు అల్లం పేస్ట్: 1tbsp
ఉప్పు : రుచికి సరిపడా
పసుపు: ½tsp
కారం: 1tsp
రెడ్ ఫుడ్ కలర్: కొద్దిగా
పచ్చిమిరపకాయలు: 2- 4
తాజా కొత్తిమీర: కొద్దిగా
తాజా పుదీనా: కొద్దిగా
ఉల్లిపాయ : 1 (సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి)
పంచదార: ½tps
టమోటాలు: 2-4 (ముక్కలుగా కట్ చేసుకోవాలి)
గరం మసాలా: ¼tsp
నూనె: 2tbsp
జీడిపప్పు: ఒక గుప్పెడు(మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి)(అవసరం అనుకుంటేనే)
గట్టి పెరుగు: 1tbsp
మొక్కజొన్న పిండి: 1tsp
తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక డ్రై నాన్ స్టిక్ పాన్ లో ఉల్లిపాయ ముక్కలు, పంచదార మరియు కొద్దిగా నూనె వేసి వేగించుకోవాలి.
2. తర్వాత అందులోనే అల్లం మరియు వెల్లుల్లి వేసి ఒక నిముషం వేగించుకోవాలి. తర్వాత కారం, పసుపు, ఉప్పు, జీడిపప్పు పొడి, పెరగు మరియు గరం మసాలా వేసి ఒక నిముషం స్టైర్ ఫ్రై చేయాలి.
3. ఇప్పుడు అందులోనే టమోటో ముక్కలు కూడా వేసి వేగించాలి.
4. ఇప్పుడు అందులో చికెన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కుల వేసి బాగా మిక్స్ చేసి, పాన్ కు మూత పెట్టాలి.
5. చికెన్ ముక్కలు మెత్తగా ఉడికేవరకూ 10-15నిముషాలు ఉడికించుకోవాలి.
6. చికెన్ కర్రీని ఇక కొద్దిసేపటిలో దించుతామనగా కొత్తిమీర మరియు పుదీనా తరుగు వేసి, బాగా మిక్స్ చేయాలి.
7. ఆంధ్రా స్టైల్ చికెన్ మసాలా రెడీ. ఈ హాట్ అండ్ స్పైసీ చికెన్ మసాలాను రైస్ ,రోటీ మరియు నాన్స్ తో సర్వ్ చేయాలి.



Click it and Unblock the Notifications