Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
బగరా ఎగ్ మసాలా: స్పైసీ ఎగ్ రిసిపి
గుడ్డుతో చేసే ఆహారాలు చాలా అద్బుతంగా ఉంటాయి. రుచి మాత్రమే కాదు, ఆరోగ్యం కూడా. గుడ్లతో వివిధ రకాల వెరైటీలను తయారు చేస్తారు. ఎగ్గటేరియన్స్ కు ఎగ్ కర్రీ చాలా ఫేవరెట్ డిష్. ఎగ్ కర్రీని ఇండియాలో వివిధ రకాలుగా తయారు చేస్తారు. అయితే అన్ని ఒకే రుచిని కలిగి ఉంటాయి.
హైదరాబాద్ రాయల్ సిటీలో బగర ఎగ్ మసాలా అనేది స్పెషల్ ఎగ్ రిసిపి. ఈ రిసిపిని ‘బగరా బైగన్'ని ఆధారంగా చేసుకొని తయారు చేయబడింది. మరి సాధారణ ఎగ్ కర్రీకి..బగరా ఎగ్ మసాలాకు మద్య టేస్ట్ ఎంత తేడానో ఒక సారి మనం కూడా తయారు చేసి చూద్దామా...

కావల్సిన పదార్థాలు:
గుడ్లు: 4(ఉడికించి పక్కన పెట్టుకోవాలి)
వేగించుకొన్నవేరుశెనగ పప్పు: 2tbsp
నువ్వులు: 2tbsp
కొబ్బరి: 1tbsp (తురుము)
జీలకర్ర: 1tsp
మెంతులు: ½tsp
ఎండు మిరపకాయలు: 2
వెల్లుల్లి: 4పాయలు(చిన్న ముక్కలుగా తరిగి)
కరివేపాకు: రెండు రెబ్బలు
పచ్చిమిరపకాయలు: 2 (చీలిక)
జీలకర్ర పొడి: 1tsp
కొత్తిమీర పొడి: 1tsp
పసుపు: 1tsp
గరం మసాలా పొడి: 1tsp
చింతపండు పేస్ట్: 2tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 2tbsp
నీళ్ళు: 1cup
తయారు చేయు విధానం:
1. ముందుగా ఫ్రైయింగ్ పాన్ లో నూనె వేసి ఉడికించి పెట్టుకొన్న గుడ్లను రెండు నిముషాలు వేగించుకోవాలి. గుడ్లు బ్రౌన్ కలర్ లోకి మారి వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి.
2. తర్వాత వేగించుకొన్న వేరుశెనగ, నువ్వులు, కొబ్బరి మరియు కొద్దిగా నీళ్ళు పోసి మొత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత పాన్ లో నూనె వేసి కాగిన తర్వాత అందులో జీలకర్ర, మెంతులు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి మరియు పచ్చిమిర్చి ఒక దాని తర్వాత ఒకటి వేసి ఒక నిముషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి.
4. ఇప్పుడు అందులో కొబ్బరి, నువ్వులు, మెంతుల పేస్ట్ వేసి, 5నిముషాలు మీడియం మంట మీద పేస్ట్ చేసుకోవాలి.
5. తర్వాత అందులో పసుపు, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా మరో 5నిముషాలు వేగించుకోవాలి.
6. ఇప్పుడు అందులో నీళ్ళు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులోనే ఉడికించి నూనెలో వేగించి పెట్టుకొన్న గుడ్లు, ఆ తర్వాత చింత పండు గుజ్జు వేయాలి.
7. చివరగా గరం మసాల పౌడర్ వేసి బాగా మిక్స్ చేయాలి. బాగా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి సర్వ్ చేయాలి. అంతే బగర ఎగ్ మసాలా రెడీ. ఇది వైట్ రైస్ మరియు జీర రైస్ కు అద్భుతంగా రుచిగా ఉంటుంది.



Click it and Unblock the Notifications