Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
స్పైసీ బెంగాలీ ఫిష్ కర్రీ
బెంగాలీ వంటలు ప్రత్యేక రుచిని కలిగి ఉంటాయి . తయారుచేయడానిికి చాలా సింపుల్ గానే ఉండే వంటలు, రుచిలో మాత్రం గ్రేట్ గా ఉంటాయి . బెంగాలీ వంటల్లో ఫిష్ వంటలకు పత్యేక ప్రాధాన్యత ఉంది. స్పైసీ ఫిష్ వంటలో మస్టర్డ్ ఫిష్ కర్రీ చాలా ఫేమస్. దీన్నే బెంగాల్లో మచ్చర్ జాల్ అంటారు. ఈ మచ్చర్ జాల్ ఫిష్ కర్రీ చాలా సింపుల్ గా ఉంటుంది.
అయితే మన స్టైల్లో ఈ ఫిష్ కర్రీని ఎలా తయారుచేయాలో ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది. మచ్చర్ జాల్ ఫిష్ కర్రీకి చిన్న చేపలు, తెలాపియ, పబ్దా, టాగ్రా మొదలగు చేపలతో ఎక్కువగా వండుతారు. మచ్చర్ జాల్ స్పైసీ రిసిపి మరి మీరు కూడా టేస్ట్ చేయాలంటే, ఎలా తయారుచేయాలో చూడండి..

కావల్సిన పదార్థాలు:
ఫిష్ (pabda) : 4 ముక్కలు
ఉల్లిపాయ: 1 (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tbsp
టమోటో: 1 (చిన్న ముక్కలుగా తరిగినవి)
పచ్చిమిర్చి: 3 (తరిగినవి)
కారం: 1tsp
పసుపు: 1/2 tsp
జీలకర్ర పొడి: 1tsp
ధనియాల పొడి : 1 / 2tsp
Kalounji:1/2 tsp
బిర్యానీ ఆకు 1
కొత్తిమీర: 2 కాడలు(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
నూనె: 3tbsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారుచేయు విధానం:
1. ముందుగా చేపముక్కలను శుభ్రంగా కడిగి పసుపు మరియు ఉప్పు పట్టించి 10నిముషాలు పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత డీప్ బాటమ్ పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో చేపముక్కలను వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.
3. ఇలా ఫ్రై చేసుకొన్న చేపముక్కలను తీసి పక్కన పెట్టుకోవాలి.
4. మిగిలిన నూనెలో బిర్యాని ఆకు, కలౌంజి(సోంపు)మరియు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి.
5. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి 2,3నిముషాలు వేగించుకోవాలి.
6. తర్వాత టమోటో ముక్కలు కూడా వేసి వేగించుకోవాలి.
7. వీటిన్నింటితో పాటు కారం, పసుపు, జీలకర్ర మరియు ధనియాల పొడి, కొద్దిగా ఉప్పు కూడా వేసి ఫ్రై చేయాలి.
8. మసాలాలు రెండు మూడు నిముషాలు బాగా వేగిన తర్వాత అందులో ఒక కప్పు నీళ్ళు పోసి కర్రీని బాగా ఉడికించాలి.
9. గ్రేవీ బాగా ఉడికిన తర్వాత అందులో ముందుగా ఫ్రై చేసుకొన్న చేపముక్కలను వేసి మూత పెట్టి మరో 5 నిముషాలు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. అంతే స్పైసీ బెంగాలీ ఫిష్ కర్రీ రెడీ.



Click it and Unblock the Notifications