Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
చికెన్ నూడిల్స్ రిసిపి: రెస్టారెంట్ స్టైల్
మాంసాహారంలో చికెన్ ఇష్టపడని వారు ఎవరూ ఉండరు కదా ఎప్పుడూ ఒకే రకంగా వండినా బోర్ అనిపిస్తుంది. అవే పదార్ధాలు అయినా కొంచెం మార్చి వండితే కొత్త రుచితో బావుంటుంది ఏ వంటకం అయినా. మన ఇండియన్ రుచులకే పరిమితం కాకుండా పక్కదేశాల రుచులను కూడా అప్పుడప్పుడూ రుచిచూస్తే వెరైటీగా కొత్తరుచులను చూసివారవుతారు. చైనీస్ వంటలంటే చాలా మంది అమితంగా ఇష్టపడతారు. వీటికోసం తప్పనిసరిగా బయటకు వెళ్ళేవారు వున్నారు. ఈ వంటకాలను ఇంట్లో చేసుకోవడం కష్టం అని అనుకుంటారు. కొద్దిగా సమయం మరికొంత శ్రద్ద పెడితే వీటిని ఇంట్లోనే రుచిగా చేసుకోవచ్చు.
అలా ఇంట్లో చేసుకోగలిగిన చికెన్ నూడిల్స్ రిసిపి రెస్టారెంట్ స్టైల్లో మీ కోసం....

కావల్సిన పదార్థాలు:
ఎముకలు లేని చికెన్ - 1cup(మీడియం సైజ్ లో కట్ చేసుకోవాలి)
చికెన్ హక్కా నూడుల్స్ - 2cups
క్యారట్లు - 1 cups (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
బెల్ పెప్పర్(క్యాప్సికమ్)- 1 cup(చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
వైట్ స్ప్రింగ్ ఆనియన్(ఉల్లిపాయలు) - 1 cup(చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
గ్రీన్ స్ప్రింగ్ ఆనియన్(ఉల్లిపాయలు) - 1cup(చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
లవంగాలు - 4
పచ్చిమిర్చి - 2-3(మద్యలోకి కట్ చేయాలి)
సోయ్ సాస్ - 1/2 tsp
కారం సాస్ - 1/4 tsp
వెనిగర్ - 1 tbsp
టొమాటో సాస్ - 1 tbsp
నూనె : 2 tbsp
తెలుపు మిరియాలు పొడి
ఉప్పు : రుచికి సరిపడా
తయారుచేయు విధానం:
1. ముందుగా చికెన్ ను నీటిలో శుభ్రంగా కడిగి, ఒక గిన్నెలో వేసి కొద్దిగా నీళ్ళు పోసి, 5-10నిముషాలు ఉడికించి పెట్టుకోవాలి.
2. ఉడికిన తర్వాత నీరు వంపేసి చికెన్ ముక్కలను పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత నూడిల్స్ కూడా ఒక గిన్నెలో వేసి సరిపడా నీళ్ళు పోసి ఉడికించి, నీరు వంపేసి, కొద్దిగా చల్లనీళ్ళు పోసి కడిగి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు ఒక పెద్ద నాన్ స్టిక్ తవాలో కొద్దిగా నూనె వేసి వేడిచేయాలి.
5. నూనె వేడయ్యాక అందులో వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి 5నిముషాలు మీడియం మంట మీద వేగించుకోవాలి.
6. అలాగే, అందులోనే తెల్లఉల్లిపాయ, క్యారెట్ మరియు క్యాప్సిమ్ ముక్కలు కూడా వేసి ఫ్రై చేయాలి.
7. మీడియం మంట మీద మొత్తం మిశ్రమాన్ని వేగించుకోవాలి. వేగుతున్నప్పుడే అందులో ఉప్పు, వైట్ పెప్పర్ పౌడర్, కూడా వేసి బాగా మిక్స్ చేయాలి.
8. ఇప్పుడు అందులో ముందుగా ఉడికించుకొన్న చికెన్ ముక్కలు, సోయా సాస్, చిల్లీ సాస్ మరియు టమోటో సాస్ వేసి లైట్ గా ఫ్రై చేసుకోవాలి.
9. చికెన్ వెజిటేబుల్స్ తో బాగా కలగలిపి మరికొన్ని నిముషాలు ఉడికించుకోవాలి.
10. చికెన్ ఉడికిన తర్వాత చివరగా గ్రీన్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసి, మిక్స్ చేయాలి.
11. తర్వాత ఉడికించిన నూడిల్స్ కూడా మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేయాలి అంతే రెస్టారెంట్ స్టైల్ చికెన్ నూడిల్స్ రెడీ...



Click it and Unblock the Notifications