Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
చికెన్ న్యూడుల్స్

ఉడికించిన నూడుల్స్ 250 grms
ఉడికించిన చికెన్ ముక్కలు-1/2cup
ఉల్లిపాయలు -2
పసుపు - 1/2 tsp
కారం - 1 tsp
గరం మసాలా పొడి - 1/2 tsp
అజినోమొటో - చిటికెడు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1/2 tsp
లవంగాలు - 4
యాలకులు - 3
దాల్చిన చెక్క -1/2 ముక్క
షాజిరా - 1/2 tsp
నూనె - 4tbsp
తయారు చేయు విధానము:
1. నూడుల్స్ ను 250గ్రా రెంటింపు నీటిలో ఉడికించి నీరు వార్చి పెట్టి వెంటనే చల్ల నీటిని అందులో పోయాలి.
2. కొద్దిగా నూనె వేసి కలిపి పెడితే ఒక దానికొకటి అంటుకోకుండా విడివిడిగా ఉంటాయి.
3. చికెన్ ఉడికించి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి.
4. వెడల్పాటి పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడిఅయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి మెత్తబడేవరకు వేయించాలి.
5. తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అజినొమోటో వేసి కలిపి మరికొద్దిసేపు వేయించాలి. అందులోనే అవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క షాజీరా, కారం వేసి కలపాలి.
6. ఇప్పుడు ఉడికించిన నూడుల్స్ కి తగినంత ఉప్పు వేసి చికెన్ ముక్కలు వేసి బాగా కలియబెట్టాలి. తర్వాత ఐదు నిమిషాలు వేయించండి అంతే చికెన్ న్యూడల్స్ రెడీ దీన్ని టమాటో సాస్ తో సర్వ్ చేయండి.



Click it and Unblock the Notifications