Latest Updates
-
మాతృ దినోత్సవం రోజున భార్య, అమ్మ మధ్య నలిగిపోతున్నారా? ఈ చిన్న ట్రిక్ పాటిస్తే గొడవలు ఉండవు! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణులు, పీరియడ్స్‌లో ఉన్న మహిళలు ఈ విషయాలు తెలియకపోతే ప్రమాదమే! -
విడాకుల కోసం కోర్టుకు వెళ్తున్నారా? ఏపీ హైకోర్టు తీసుకున్న ఈ కొత్త నిర్ణయం మిమ్మల్ని షాక్‌కు గురి చేస్తుంది! -
ఎండలు మండుతున్నాయి.. అకస్మాత్తుగా పిడుగులు పడతాయా? మీ కుటుంబం కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
మీ భోజనం రుచిని రెట్టింపు చేసే సీక్రెట్ పచ్చిమిర్చి పచ్చడి..అప్పటికప్పుడు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మే 8: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది.. ధనలాభం ఖాయం! -
గ్యాస్, అసిడిటీకి చెక్..పడుకునే ముందు ఇదొక గ్లాస్ తాగితే కడుపు ఉబ్బరం మాయం! -
మే 8న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన వర్షమే! -
గుజరాతీ స్పెషల్ జొన్న ఖీచూ..బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్లకు సూపర్! -
అన్నమయ్య 618వ జయంతి వేడుకలు: భక్తుల పరవశం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. ఈ విశేషాలు తెలుసా?
నాన్ వెజ్ ప్రియులకు చక్కటి బ్రేక్ ఫాస్ట్ చికెన్ పరోటా.....
ప్రతి రోజూ ఉదయాన్నే ఏదో ఒక బ్రేక్ ఫాస్ట్ తినాల్సిందే. అందుకు ఉదయాన్నే అతి త్వరగా రెడీ అయిపోయే బ్రేక్ ఫాస్ట్ లను ఎంపిక చేసుకొంటుంటారు. దోస, ఉప్మా, ఇడ్లీ, గుడ్లు వంటివి తీసుకొంటుంటారు. సెలవు రోజుల్లో కూడా ఒకే బ్రేక్ ఫాస్ట్ తినితిని బోరుకొడుతుంటే కనుక ఈ చక్కటి రుచికరమైన చికెన్ పరోటా రిసిపి రుచి చూడండి. పరోటాను చాలా రకాలుగా చేస్తారు. అయితే ఈ చికెన్ పరోటాను ఉడికించిన చికెన్ తో అతి త్వరగా తయారు చేసుకోవచ్చు.

కావల్సిన పదార్థాలు:
చికెన్: 250grms
ఉల్లిపాయలు: 2 (sliced)
క్యాప్సికమ్: 1 (sliced)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp
పచ్చిమిర్చి: 4 (చిన్నగా కట్ చేసుకోవాలి)
ఛాట్ మసాల: 1tsp
పెప్పర్: 1tsp
మైదా: 2 cups
నెయ్యి: 1tbsp
నూనె: 1tbsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా పాన్ లో నూనె వేసి వేడిచేయాలి. అందులో మిరియాలు వేసి లైట్ గా వేయించాలి.
2. తర్వాత అందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించాలి.
3. తర్వాత క్యాప్పికమ్, కొద్దిగా ఉప్పు వేసి వేయించాలి. క్యాప్పికమ్ వేగిన తర్వాత చికెన్ ఖీమా లేదా (కర్రీ చేసిన చికెన్ తినగా మిగిలిన చికెన్ ను బాగా మెత్తగా చిదిమి అది వేసుకోవచ్చు). వేగిన తర్వాత పాన్ క్రిందికి దింపుకొని బాగా చల్లారనివ్వాలి.
4. అంతలోపు మైదాను చపాతీ పిండిలా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఉండలు చేసి పెట్టుకొన్న పిండిని కొద్దిగా లోతుగా వత్తుకొని అందులో ఫై చేసి పెట్టుకొన్న చికెన్ మాసాలతో నింపి దాన్ని మళ్ళీ రోల్ గా చుట్టాలి.
5. ఇప్పుడు ఇలా అన్నింటిని నింపుకొన్న తర్వాత పరోటాల చపాత కర్రతో వత్తులకోవాలి. అన్ని వత్తుకొన్న తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి నెయ్యి వేసి వేడయ్యాక దాని మీద పరోట వేసి రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. అంతే చికెన్ పరోట రిసిపి రెడీ..



Click it and Unblock the Notifications