చికెన్ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్

Chicken Vegetable Fried Rice
కావలసిన పదార్ధాలు:
బోన్ లెస్ చికెన్: 1/2 kg
బీన్స్: 2cup
నెయ్యి: 2tbsp
క్యాప్సికం: 1cup
సోయ సాస్: 2tbsp
పచ్చి బటాని: 1cup
క్యారెట్ ముక్కలు: 2cup
అల్లం వెల్లుల్లి పేస్టు: 2tbsp
సన్నగా తరిగిన క్యాబేజ్: 2cup
ఉల్లిపాయలు: 2
పచ్చి మిర్చి: 4
కోడిగుడ్లు: 6
పసుపు: చిటికెడు
నూనె: కావలసినంత
ఉప్పు: రుచికి సరిపడా

అన్నం లోకి :-
భాస్మతి బియ్యం: 1/2kg
దాల్చిన చెక్క:అంగుళం సైజ్ రెండు
లవంగాలు: 6
ఏలకులు: 6
జీడి పప్పు: 1/2cup
సాల్ట్: రుచికి సరిపడా

తయారు చేయు విధానం:
1. ముందుగా భాస్మతి బియ్యాన్ని బాగా కడిగి అందులో నీరు పోసి దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఉప్పు, ఒక్క టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఉడకనివ్వాలి.
2. ఉడికించిన అన్నాన్ని ఒక్క పెద్ద గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
3. తరువాత చికెన్ ని కడిగి అందులో కొద్దిగా నీరు పోసి అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు,కొద్దిగా ఉప్పు వేసి ఉడకనివ్వాలి.
4. ఉడికిన చికెన్ ని తీసుకొని సన్నగా చిన్న చిన్న ముక్కలుగా చిదిమి పక్కన పెట్టుకొని, స్టౌ వెలిగించి దాని మీద బాణలి పెట్టి నూనె వేసి కొంచెం వేడి అయిన తర్వాత అందులో కూరగాలన్ని విడి విడి గా వేపుకొని ఉడికిన రైస్ లో కలుపుకోవాలి.
5. తరువాత పాన్ లో నూనె పోసి అందులో చిదిమిన చికెన్ ని వేసి బాగా వేపుకొని దాన్ని కూడా రైస్ లో కలపాలి. తరువాత మల్లి పాన్ లో నూనె పోసి ఉల్లి పాయముక్కలు వేసి బాగా వేగేకా అందులో నీళ్ళల్లో కలిపిన సోయా సాస్ పోసి కొంచెం వేగనిచ్చి దాన్ని కూడా రైస్ లో కలపాలి.
6. చివరిగా పాన్ లో నూనె వేసి అందులో కోడిగుడ్లు కొట్టి బాగా వేపుకొని దాన్ని కూడా అన్నం లో వేసి బాగా కలుపుకోవాలి.
7. వీటన్నింటితో ఒక్క టేబుల్ స్పూన్ నెయ్యి వేసి రైస్ ని బాగా కలుపుకొని కొత్తిమీర, వేపిన జీడిపప్పు తో అందంగా అలంకరించుకొని ఒక్క బౌల్ లోకి తీసుకోవాలి. అంతే చికెన్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ.

Story first published: Friday, August 6, 2010, 11:15 [IST]
Desktop Bottom Promotion