Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
కూర్చుని ‘లాగిస్తునే’... ఉంటారు..!!

కావల్సిన పదార్థాలు:
- బోన్ లెస్ చికెన్ 500 గ్రాములు (చిన్నిచిన్న ముక్కులుగా కట్ చేసుకోవాలి)
- పేలాల పిండి 4 టేబుల్ స్పూన్లు,
- పచ్చిమిరపకాయలు 4 ( సన్నగా తరుగుకోవాలి),
- సోయా సాస్ 4 టేబుల్ స్పూన్లు,
- టమాటా సాస్ 2 టేబుల్ స్పూన్లు,
- ఉల్లిపాయలు 2 ( సన్నగా తరిగినవి),
- వెల్లులి రెబ్బలు 6 ( సన్నగా తరుగుకోవాలి),
- ఉల్లికోళ్లు 4 (ముక్కలుగా కోసుకోవాలి).
- బెంగుళూరు మిరిపకాయ 1 (సన్నటి ముక్కలుగా కోసుకోవాలి),
- అల్లం, వెల్లులి పేస్ట్ 2 టీ స్పూన్లు,
- ఆలివ్ ఆయిల్ 4 టేబుల్ స్పూన్లు,
- చైనా గ్రాస్
- సాల్ట్ తగినంత,
తయరీ విధానం :
- తొలత మాంసపు ముక్కలను అల్లం, వెల్లులి మిశ్రమంలో సాల్ట్ ను కలిపి నానబెట్టుకోవాలి.
- గిన్నెలోకి కొద్దిగా నీరు తీసుకుని అందులో పేలాల పిండిని వేసి తరుగుకున్న సగం పచ్చిమిర్చి ముక్కలను వేయాలి. తరువాత మాంసపు ముక్కలను వేసి కలుపుకోవాలి.
- లోతైన పాన్ లో నూనెను వేడి చేసుకుని చికెన్ ముక్కలను వేయించి పక్కనపెట్టకోండి.
- అనంతరం తరుగుకున్న ఉల్లిముక్కలను బంగారు రంగు వచ్చేంత వరకు వేయించి, అందులో వెల్లులి రెబ్బలను కలిపి తాలింపు పెట్టుకోండి. అనంతరం తరుగుకున్న ఉల్లికోళ్లతో పాటు బెంగుళూరు మీర్చి, మిగిలిన పచ్చిమిర్చి తరుమును వేసి రెండు నిమిషాల పాటు వేయించండి.
- తరవాత ఉడుకుతున్న మిశ్రమంలో టమోటో సాస్, సోయా సాస్ లను వేసి ఉడికించికండి. బాగా ఉడికిన తరువాత ఫ్రై చేసుకుని సిద్ధంగా ఉంచుకున్న చికెన్ ముక్కలను వేసి 4 నిమిషాల పాటు ఉడికించుకోండి.
- ఉడుకుతున్న మిశ్రమంలో 1 కప్పు నీటితో పాటు చైనా గ్రాస్ మరియు సాల్ట్ ను కలపండి.
- పాన్ పై మూతపెట్టి 10 నిమిషాలు తక్కువ వేడిలో ఉడికించుకోండి, ముక్కలు బాగా ఉడికిన తరువాత పాన్ లో నీరు ఆవిరయ్యేందుకు వేడిమిని కాస్త పెంచుకోండి.
- అంతే.. మీరు ఎదురుచూస్తన్న 'చిల్లీ' చికెన్ వంటకం తయారైనట్లే.



Click it and Unblock the Notifications