Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
చిల్లీ చికెన్ నూడుల్స్-చైనీస్ ట్రీట్

కావలసిన పదార్థాలు:
నూడుల్స్: 150grms
చికెన్: 150grms
క్యాబేజీతురుము: 1/2cup
క్యారెట్ తురుము: 1/2cup
ఉల్లిపాయ పెద్దది: 1
క్యాప్సికమ్: 1
ఉప్పు: రుచికి సరిపడా
మిరియాల పొడి కొద్దిగా
నూనె: తగినంత
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా చికెన్ ముక్కలను శుభ్రం చేసుకొని వాటికి ఉప్పు, మిరియాల పొడి పట్టించి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత ఒక గిన్నెతీసుకొని అందులో ఒక లీటర్ నీళ్ళు పోసి అందులో నూడుల్స్, స్పూన్ నూనె వేసి రెండు మూడు పొంగులు రానివ్వాలి.
3. నూడుల్స్ కొద్దిగా ఉడికిన తర్వాత నీరంతా వంపేసి పక్కన పెట్టువాలి.
4. ఇప్పుడు కూరగాయలను ముక్కలుగా తరిగి సిద్దం చేసి పెట్టుకొన్న తరువాత పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిసేపు వేయించి, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేర్చి మరికొద్దిసేపు వేగనివ్వాలి.
5. తర్వాత మిగిలిన కూరగాయల ముక్కలు కూడా వేసి మరికొద్దిసేపు వేయించుకోవాలి. వీటికి చికెన్ ముక్కలు కలిపి రెండు నిమిషాలు వేయించుకొన్న తర్వాత ఉప్పు కలిపి కొద్దిగా నీరు పోసి ముక్కలనీ ఉడికించుకోవాలి.
6. నీరంతా ఇంకిపోయి ముక్కలు ఉడికిన తరువాత ముందుగా ఉడికించి పెట్టుకున్న నూడుల్స్ చేర్చాలి. అన్నింటినీ మరికొద్దిసేపు వేయించి దింపేయాలి.
7. దించే ముందు ఎరుపు క్యాప్సికమ్ ముక్కలతో అలంకరించాలి. అంతే చిల్లీ చికెన్ నూడుల్స్ రెడీ. వీటిని వేడివేడిగా తింటే చాలా రుచికరంగా ఉంటాయి.



Click it and Unblock the Notifications