Latest Updates
-
కన్య, ధనస్సు, మీన రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ జాతకం ఎలా ఉందో చూడండి! - బుధవారం, 29 ఏప్రిల్ 2026 -
గర్భిణీలు ఎండల వేళ ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమేనా? తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం ఇప్పుడే తెలుసుకోండి -
లివ్-ఇన్ రిలేషన్షిప్లో విడిపోవడం నేరమా? సుప్రీంకోర్టు తీర్పుతో జంటలకు ఊరట! -
పెరుగన్నంలోకి ఈ కరకరలాడే బంగాళదుంప ఫ్రై ఉంటే.. ఒక్క ముద్ద కూడా మిగల్చరు! -
లైవ్-ఇన్ రిలేషన్షిప్లో విడిపోవడం నేరం కాదా? సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో మారనున్న సమీకరణాలు! -
మామిడి టెంకలను పారేస్తున్నారా? ఈ ఉపయోగాలు తెలిస్తే షాక్ అవుతారు! -
బ్రేక్ ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా..ఈ సొరకాయ ఊతప్పం రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
గజకేసరి యోగం పేరుతో సోషల్ మీడియాలో మోసపోతున్నారా? అసలు నిజం ఇదే! -
బిర్యానీ, పులావ్ లోకి అదిరిపోయే కాంబినేషన్..కమ్మని పైనాపిల్ రైతా ఎలా చేసుకోవాలంటే.. -
బుద్ధ పూర్ణిమ రోజున ఈ పనులు చేస్తున్నారా? శాంతి, సౌభాగ్యం కోసం తప్పక పాటించాల్సిన నియమాలివే!
సులభమైన ఇండియన్ చికెన్ వంటకం దహి చికెన్
దహీ చికెన్ ఇండియన్ వంటకం. ఇది తయారు చేయాలంటే కొద్దిగా ఓపిక ఉండాలి. ఈ చికెన్ రిసిపి అద్భుతమైన టేస్ట్, వాసన కలిగి వేడి వేడి అన్నం, రోటీ, పులావ్, జీరా రైస్ వంటి వాటికి మంచి అద్భుతమైన కాంబినేషన్.
ఈ ఇండియన్ దహీ చికెన్ కు మసాలా దినుసులు అధికంగా ఉపయోగించనవసరం లేదు. ఎందుకంటే ఈ వంటకం యొక్క సువాసనంత పెరుగుతోనే వస్తుంది. పెరుగులో నానబెట్టడం వల్ల అద్భుతమైన టేస్ట్ కలిగి మంచి కలర్ కూడా వస్తుంది. మెంతులు చేర్చడంతో మరింత టేస్ట్. అయితే ఈ వంట తయారు చేయడానికి కొద్దిగా సమయం పడుతుంది. కొత్త రుచి చూడాలనుకొనే వారు కాస్త ఓపిగ్గా దీన్ని తయారు చేసుకోవచ్చు.
కావల్సిన పదార్థాలు:
చికెన్: 500 grams
పెరుగు: 250 grams
మెంతులు: 4 tablespoons
ఉల్లిపాయలు: 2 (thinly sliced)
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 2 tbsp
పచ్చిమిర్చి: 4(finely chopped)
ఎండు మిర్చి: 1 tsp
జీలకర్రపొడి: 1 teaspoon
మిరియాలు: 8
బిర్యాని ఆకు : 1
నూనె: tbsp
బట్టర్ లేదా నెయ్యి: కొద్దిగా
పంచదార: 1 tsp
ఉప్పు రుచికి సరిపడా

తయారు చేయు విధానం:
1. ముందుగా చికెన్ ను పెరుగు మరియు ఉప్పు మిశ్రమంతో అరగంట పాటు మ్యారినేట్ చేయాలి. దీన్ని ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు లేదా బయట కూడా మూత పెట్టి పెట్టుకోవచ్చు
2. తర్వాత పాన్ తీసుకొని నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అందులో మిరియాలు, బిర్యాని ఆకు, పచ్చిమిర్చి ముక్కలు మరియు కారం, జీలకర్ర పొడి వేసి బాగా మిక్స్ చేస్తూ వేగించుకోవాలి. వేగిస్తూనే మూత పెట్టాలి.
3. కొద్ది సేపటి తర్వాత మూత తీసి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేగించుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మరో రెండు మూడు నిముషాల వేగించాలి.
4. ఇప్పుడు అందులో పెరుగులో మ్యారినేటె చేసిన పెట్టుకొన్న చికెన్ వేసి మరో పది నిముషాల పాటు వేగించి, తర్వాత మెంతులు, నెయ్యి లేదా బట్టర్ కూడా వేసి బాగా కలగలిపి మూత పెట్టి మరో పది నిముషాలు ఉడికించుకోవాలి. అంతే దహీ చికెన్ రెడీ.దీన్ని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది. అలాగే జీరా రైస్ లేదా పీస్ పులావ్ లోక్కూడా అద్భుతంగా ఉంటుంది. ఇంకా రోటీలకు కూడా మంచి కాంబినేషన్.



Click it and Unblock the Notifications