Latest Updates
-
గ్రహాల అరుదైన కలయిక: ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మహాలక్ష్మి రాజయోగంతో పట్టిందల్లా బంగారమే! -
బ్రేక్ ఫాస్ట్ కైనా, డిన్నర్ కైనా.. స్టఫ్డ్ పనీర్ కుల్చా చాలా ఈజీగా చేసుకోండిలా..వేళ్లు చప్పరిస్తూ తింటారు! -
మీటింగ్లో కెమెరా ఆన్ చేయాలని మేనేజర్ మొండిపట్టు.. ఉద్యోగిని గెటప్ చూసి మైండ్ బ్లాంక్.! -
రాత్రిపూట అతి ఆలోచనలతో నిద్ర కరువు.. ఈ చిట్కాలతో ఇట్టే కునుకు పట్టేస్తుంది.! -
భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి.. పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు.! -
ఈ ప్రత్యేక మసాలాతో దిండిగల్ వెజ్ బిర్యానీ చేశారంటే..ప్రతి మెతుకు అమృతమే..మిగతావన్నీ మర్చిపోతారు! -
కళ్లకి కాటుక ఎలా పెట్టుకుంటున్నారు.?.. ఇలా అప్లై చేశారంటే కంటి కింద కురుపులు తప్పవు.! -
అసలు రోజుకు ఎంత ప్రోటీన్ తినాలి? మన శరీరానికి ఎంత అవసరం? -
ఆవకాయ, నిమ్మకాయ బోర్ కొట్టిందా? అయితే ఈ వెరైటీ బంగాళదుంప ఊరగాయ ట్రై చేయండి! -
మైదా లేకుండా సమోసాలను మించిన రుచితో ఉల్లి కచోరీ.. ఇలా చేస్తే ఎన్ని తిన్నా బోర్ కొట్టదు.!
మామిడి టెంకలను పారేస్తున్నారా? ఈ ఉపయోగాలు తెలిస్తే షాక్ అవుతారు!
ఎండాకాలంలో ఎక్కడ చూసినా నోరూరించే మామిడి పండ్లే కనిపిస్తాయి. పసిపిల్లల నుండి పండు ముసలి వాళ్ల వరకు అందరూ వీటిని లొట్టలేసుకుని మరీ తింటారు. అద్భుతమైన రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండటం వల్లే మామిడిని పండ్ల రారాజు అంటారు. అయితే మనం సాధారణంగా చేసే ఒక పెద్ద పొరపాటు ఏమిటో తెలుసా? మామిడి పండును ఆస్వాదించిన తర్వాత దాని టెంకను (గింజను) పనికిరాని చెత్తగా భావించి పారేయడమే.

ఆయుర్వేదంలో మామిడి టెంకను ఒక అమూల్యమైన నిధిగా అభివర్ణించారని మీకు తెలుసా? విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లకు ఇది ఒక పవర్ హౌస్ లాంటిది. చిన్నప్పటినుంచి మన అమ్మమ్మలు, నానమ్మలు మామిడి గింజల ఉపయోగాలు చెబుతున్నా మనం పెద్దగా పట్టించుకోము. కానీ దీని ఔషధ గుణాలు తెలిస్తే, ఇకపై పొరపాటున కూడా మీరు దానిని పారేయరు. మామిడి గింజల అద్భుత ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ చూడండి.
ఆరోగ్యానికి దివ్యౌషధం..మామిడి గింజ
జీర్ణ సమస్యలకు చెక్
మీరు తరచుగా అజీర్తి, ఎసిడిటీ లేదా విరేచనాలతో బాధపడుతుంటే మామిడి గింజల పొడి మీకు ఒక సర్వరోగ నివారిణి. ఇది పేగుల్లో ఉండే నులిపురుగులను నాశనం చేసి కడుపును శుభ్రంగా ఉంచడమే కాకుండా, జీవక్రియను వేగవంతం చేస్తుంది.
గుండె పదిలం - కొలెస్ట్రాల్ దూరం
శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించడంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. రక్త ప్రసరణను మెరుగుపరిచి గుండె జబ్బుల ప్రమాదాన్ని దరిచేరనివ్వవు.
మధుమేహానికి మందు
మామిడి పండు తింటే షుగర్ పెరుగుతుందని భయపడేవారికి, దాని గింజ ఒక వరం. మామిడి గింజల సారం శరీరంలో గ్లూకోజ్ శోషణను తగ్గించి, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
రక్తహీనత నివారణ
ఐరన్ పుష్కలంగా ఉండే ఈ గింజలు రక్తహీనత సమస్యను జయించడానికి ఎంతో సహాయపడతాయి.

అందానికి, కేశాలకు కేరాఫ్ అడ్రస్
ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా చేయలేని మాయను మామిడి గింజలు చేస్తాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగిన ఈ గింజల పొడిని నీళ్లతో పేస్ట్ లా చేసి ముఖానికి రాసుకుంటే మొటిమలు, చర్మ అలెర్జీలు ఇట్టే మాయమవుతాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది.
జుట్టు సమస్యలకు బైబై
మామిడి గింజల పొడిని ఆవ నూనె లేదా కొబ్బరి నూనెలో కలిపి కొన్ని రోజులు ఎండలో ఉంచాలి. ఆ నూనెతో తలకు మసాజ్ చేసుకుంటే జుట్టు రాలడం, చుండ్రు తగ్గిపోవడమే కాకుండా, చిన్న వయసులో జుట్టు నెరవడం ఆగిపోతుంది.
ముత్యాల్లాంటి దంతాలు
ఈ పొడితో పళ్లు తోముకుంటే దంతాల పసుపుదనం పోయి మెరిసిపోతాయి, చిగుళ్లు కూడా దృఢంగా మారతాయి.
పొడిని ఎలా తయారు చేయాలి? ఎలా వాడాలి?
మామిడి టెంకలను ముందుగా ఎండలో బాగా ఎండబెట్టాలి. అవి పూర్తిగా ఆరిన తర్వాత,పైన ఉండే గట్టి పెంకును పగలగొట్టి లోపలి గింజను బయటకు తీయాలి. ఆ గింజలను మిక్సీలో వేసి మెత్తని పొడిలా పట్టుకుని, గాలి చొరబడని ఒక గాజు సీసాలో భద్రపరుచుకోవాలి.
ప్రతిరోజూ ఉదయం అర టీస్పూన్ ఈ పొడిని గోరువెచ్చని నీటిలో కలుపుకుని లేదా కొద్దిగా తేనెతో కలిపి తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications