Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
ఎగ్ దమ్ బిర్యానీ-స్పెషల్ టేస్ట్
బిర్యానీ వంటకాలంటే మాంసాహారులకు బాగా తెలుస్తుంది. బిర్యానీ చాలా రుచికరంగా..కొన్ని సువాసలను వెదజల్లే మసాలాలను దంటించి తయారు చేస్తారు. బిర్యానీ తయారు చేయడానికి కాస్త ఓపిక, కాస్త నేర్పు ఉంటే చాలు రుచికరమైన బిర్యానీ రెడీ అయినట్లే.
ఉడికించిన గుడ్లతో బిర్యానీ వండటం అంటే చికెన్ లేదా మటన్ బిర్యాని చేసినట్లే. ఎగ్ తో మామూలు బిర్యాని కంటే కొంచెం వెరైటీగా ఎగ్ దమ్ బిర్యానీ తయారు చేసుకొంటే అద్భుతమైన కొత్త టేస్ట్ ను మీరు రుచి చూడవచ్చు. ఎగ్ దమ్ బిర్యానీ..హైదరాబాదీ బిర్యానీని తలపిస్తుంది. అదే స్టైల్ లో తయారు చేయడం వల్ల టేస్ట్ కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది. మరి మనం కూడా ఒక సారి ఎగ్ దమ్ బిర్యానీ మన ఇంట్లో ప్రయత్నించే ఇంట్లో వారికి కొత్త రుచిని అందిద్దామా...

కావల్సిన వస్తువులు:
గుడ్లు: 6
బిర్యాని రైస్ తయారు చేయడానికి కావల్సినవి:
బియ్యం: 2cups
చికెన్ స్టాక్: 3cups(చికెన్ ఉడికించి తీసుకొన్న నీరులేదా సూప్)
లవంగాలు: 4
చెక్క: చిన్న ముక్క
బ్లాక్ కార్డమం: 3
బ్లాక్ పెప్పర్: 4-6
బిర్యాని ఆకు: 1
నిమ్మరసం: 2tsp
ఉప్పు: రుచికి సరిపడా
నెయ్యి లేదా నూనె: 1tbsp
మసాలా కొరకు:
నెయ్యి: 4tbsp
ఉల్లిపాయ: 2(సన్నగా కట్ చేసుకోవాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 3tsp
టమోటో: 2(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
తాజా కొత్తిమీ తరుగు: 1/4cup
కారం: 1tsp
పసుపు: 1/4tsp
గరం మసాలా: 1tsp
పెరగు: 1/2cup
నిమ్మరసం: 2tbsp
గార్నిషింగ్ కోసం-లేయరింగ్
ఉల్లిపాయ: 1(కొంచెం మందంగా తరిగిపెట్టుకోవాలి)
నెయ్యి: 2tbsp
జీడిపప్పు: 1/4cup
కుంకుమపువ్వు: చిటికెడు
పాలు: 2tbsp
తయారు చేయు విధానం:
1. ముందుగా గుడ్లను ఉడికించి పొట్టుతీసి పక్కన పెట్టుకోవాలి. (మీకు ఇష్టమైతన ఉడికించిన గుడ్డును రెండు బాగాలుగా కట్ చేసి పెట్టుకోవచ్చు)
2. గార్నిషింగ్: స్టౌ మీద పాన్ పెట్టిఅందులో నెయ్యి వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేగించుకోవాలి.
3. తర్వాత అందులోనే జీడిపప్పు మరియు ద్రాక్ష కూడా వేసి వేగించుకోవాలి.
4. తర్వాత ఒక కప్పు వేడి పాల్లో చిటికెడు కుంకుమపువ్వు వేసి వేడి పక్కన పెట్టుకోవాలి.
5. మసాల కోసం: మందపాటి గిన్నెలో నెయ్యివేసి, వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి లైట్ గా వేగించుకోవాలి. తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు మూడు నిముషాల వేగించుకోవాలి.
6.మసాలకోసం సిద్దంగా పెట్టుకొన్న అన్ని వస్తువులను వేసి 5నిముషాల పాటు తక్కువ మంట మీద వేగించుకోవాలి.
7. తర్వాత అందులోనే ఉడికించిన గుడ్లను కూడా వేసి రెండు నిముషాల వేగించాలి.
8. అన్నం: బియ్యాన్ని శుభ్రంగా కడిగి 15నిముషాలు పక్కన పెట్టుకోవాలి.
9. ఇప్పుడు మరో పాన్ ను స్టౌ మీద పెట్టి నెయ్యి వేసి అన్నం కోసం సిద్దం చేసుకొన్న మాసాలాలన్నింటిని అందులో వేసి వేగించి అందులోనే నీరు వంపేసి బియ్యాన్ని కూడా వేసి ఒక నిముషం వేగించుకోవాలి.
10. తర్వాత అందులోనే చికెన్ స్టాక్, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి 90%అన్నం ఉడికేంత వరకూ మీడియం మంట మీద ఉడికించుకోవాలి.
11. లేయరింగ్: ఇప్పుడు మంద పాటి పాన్ ను స్టౌ మీద పెట్టి అందులో ఎగ్ మరియు మసాలాను మొదటి లేయర్ గా పరవాలి. తర్వాత దీని మీద అన్నంను పరవాలి.అన్నం మీదు నెయ్యిలో వేయించుకొన్న ఉల్లిపాయ, జీడిపప్పు,ద్రాక్షను పరవాలి. ఇలా రెండు మూడు లేయర్లుగా ఒకదాని తర్వాత ఒకటి పరుచుకోవాలి.
12. చివరి లేయర్ మీద కుంకుమ పువ్వు నానబెట్టుకొన్న పాలను చిలకరించాలి. తర్వాత దీని మీద అల్యూమినియం సీట్ పరచి మూత పెట్టి తక్కువ మంట మీద 10-15నిముషాలు ఉడికించుకోవాలి. అంతే ఎగ్ దమ్ బిర్యాని రెడీ. మీకు ఇష్టైన రైతా తో వేడి వేడిగా సర్వ్ చేయాలి.



Click it and Unblock the Notifications