Latest Updates
-
నోట్లో కరిగిపోయే గులాబ్ జామున్ కావాలా? అయితే స్వీట్ షాపుల సీక్రెట్ ఇదే! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణీలు ఈ తప్పులు చేస్తే బిడ్డకు ప్రమాదమేనా? -
రొటీన్ చికెన్ కూరతో బోర్ కొట్టిందా? అయితే ఈ సండే మధురై చికెన్ కొత్తు కర్రీ ట్రై చేయండి -
పెళ్లైన ఏడు నెలలకే నవ దంపతుల విషాదాంతం… అసలు ఏం జరిగింది? షాకింగ్ నిజాలు! -
పరగడుపున ఈ జ్యూస్ తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చు..కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోతుంది! -
NEET రాసేటప్పుడు పీరియడ్స్ వస్తున్నాయా? కంగారు వద్దు, ఈ చిట్కాలు పాటిస్తే చాలు! -
వట్టి నీళ్లు తాగలేకపోతున్నారా? డీహైడ్రేషన్ కు చెక్ పెట్టే 5 అద్భుతమైన ఆహారాలు ఇవే! -
మే 3, 2026: ఈ రాశుల వారికి అదృష్టం వరించనుంది.. పట్టిందల్లా బంగారం కావాల్సిందే! -
వరియాన్ యోగం, విశాఖ నక్షత్రం.. ఈరోజు మీ సంపదను ఎలా పెంచుతాయో తెలుసా? -
ఈ ఆమ్లెట్ రుచి చూశారంటే మతి పోవాల్సిందే..నోట్లో వెన్నలా కరిగిపోతుంది
మాంసాహార ప్రియులకు వెరైటీ టేస్ట్ ఎగ్ ఖీమా కర్రీ

కావలసిన పదార్థాలు:
గుడ్లు: 4(ఉడికించినవి)
బిర్యాని ఆకు: 1
మిరియాలు: 5-8
యాలకులు: 2-3
చెక్క: చిన్న ముక్క
స్టార్ ఆనిస్: 1(స్పైసీ ఐటమ్)
ఉల్లిపాయలు : 2(కట్ చేసుకోవాలి)
వెల్లుల్లిపాయలు: 6(తరుగు)
అల్లం: చిన్న ముక్క(తరుగు)
పచ్చిమిర్చి: 4(మద్యలోనికి కట్ చేసుకోవాలి)
మటన్ ఖీమా: 1/2kg
టమోటో: 2(కట్ చేసుకోవాలి)
పచ్చి బఠానీ: 1cup
కారం: 1tbsp
జీలకర్రపొడి: 1tbsp
గరంమసాలా: 2tsp
నెయ్యి: 1tbsp
నూనె: 3tbsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా గుడ్లను ఉడికించి పొట్టు తీసి, మద్యకు కట్ చేసిపెట్టుకోవాలి. లేదా మీకు కావల్సిన సైజులో కట్ చేసిపెట్టుకోవాలి.
2. తర్వాత స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి అందులో వెల్లుల్లి ముక్కలు వేసి వేయించుకోవాలి.
3. తర్వాత అందులో కట్ చేసి పెట్టుకొన్న గుడ్డు ముక్కలను వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించుకోవాలి. తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు మరో పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి అందులో బిర్యాని ఆకు, మిరియాలు, లవంగాలు, చెక్క, యాలకులు, స్టార్ ఆన్సి వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి.
5. నూనెలో ఈ స్పైసీ మసాలాలన్నీ వేగుతూ మంచి సువాసన వచ్చేటప్పుడు మరికొద్దిగా ఉల్లిపాయల ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకూ వేయించుకోవాలి. తర్వాత వెల్లుల్లి, అల్లం తురుము వేసి వేయించుకోవాలి.
6. రెండు నిమిషాల తర్వాత పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత ఖీమా కూడా వేసి బాగా స్పైసీ మసాలాలన్ని బాగా పట్టేంత వరకూ వేయించుకోవాలి.
7. మటన్ ఖీమా బాగా వేగి కొద్దిగా బ్రౌన్ కలర్ లోకి మారేసమయంలో టమోటో, పచ్చిబఠానీ, ఉప్పు చల్లి , కారం, జీలకర్ర, గరం మసాలా పౌడర్ అన్నీ కలిపి బాగా మిక్స్ చేసి మీడియం మంట మీద వేయించుకోవాలి.
8. మటన్ బాగా వేగి ఫ్రై అయ్యే సమయంలో కొద్దిగా నీళ్ళు పోసి మూత పెట్టి ఖీమా బాగా ఉడికి మెత్తబడుతుంది. ఇప్పుడు ముందుగా ఉడికించి ఫ్రై చేసి పెట్టుకొన్న గుడ్డును ఇందులో కలుపుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలను కూడా పైన చల్లి , కొద్దిగా నెయ్యిని చిలకరించాలి. అంతే ఎగ్ ఖీమా కర్రీ రెడీ. ఇది పులావ్ మరియు రోటీ లోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర తరుగును గార్నిష్ చేసుకొని సర్వ్ చేయడమే ఆలస్యం.



Click it and Unblock the Notifications