Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
ఎగ్ పరోటా

గుడ్లు: 4(ఉడికించినవి)
బంగాళాదుంపలు: 3(ఉడికించినవి)
గోధుమపిండి: 1/2 kg
మైదా: 1/4 kg
అరటి పళ్ళు: 2
అల్లం: చిన్న పీస్
పచ్చిమిర్చి: 4
ఉప్పు: రుచికి సిరిపడా
కారం: 1 tbsp
కొత్తిమిర: 1/2 cup
ఆయిల్: కావలసినంత
తయారు చేయు విధానాము:
1. గోధుమ పిండి, మైదాపిండి కాస్త వెచ్చటి నూనె, నీళ్లు వేసి చపాతీపిండిలా కలిపాలి. ఈ పిండి కలిపేటప్పుడే అరటిపళ్లు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసి కలపాలి. పిండి పళ్లు బాగా కలిసేటట్టు కలిపి, తడి బట్టలో చుట్టి పెట్టాలి.
2. అల్లం పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా తరిగి, కొత్తిమీర, కారం, వేసి కచపచ దంచాలి.
3. ఆ మిశ్రమాన్ని ఉడికిన బంగాళాదుంపలు చిదిపి, ఉడికిన గుడ్ల ను చిన్న చిన్న ముక్కలుగా కోసి, కొద్దిగా ఉప్పు చేర్చి అన్నింటిని కలిపి మసాలా ముద్దలా తయారుచేయాలి.
4. మొదటే తయారు చేసి పెట్టుకొన్న గోధుమ, మైదా ముద్ద నుండి కొద్దిగా పిండి తీసుకొని ముద్దలా తయారు చేయాలి. ఉండను చిన్నగా వత్తి మధ్యలో ఆలు ఎగ్ మిశ్రమం వుంచాలి. నాలువైపులా అంచులు మూసి, మళ్లీ ఉండలా చేయాలి.
5. ఇప్పుడ ఈ ఉండను చపాతీలా చెత్తోనే వత్తుకోవాలి. స్టౌ పైన పాన్ పెట్టి నెయ్యి లేదా ఆయిల్ వేసి దోరగా వేయించాలి అంతే ఎగ్ పరోటా రెడీ.



Click it and Unblock the Notifications