Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
ఫిష్ 65 ఈవెనింగ్ స్నాక్ మరియు సైడ్ డిష్
సాధారణంగా మాంసాహార ప్రియులు చాలా మంది చికెన్, మటన్ తిన్నంతగా చేపలను తినరు. అయితే చేపల్లో ఉండే గొప్ప ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుంటే, చేపలను తినకుండా ఉండాలేరు. చికెన్ మటన్ కంటే, సీఫుడ్ లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. క్యాలరీలు తక్కువ, ఫ్యాట్ తక్కువగా ఉండటం వల్ల గుండెకు చాలా మంచి ఆహారం.
చేపలతో వివిధ రకాల వంటలను వండుకోవచ్చు. గ్రేవీ, పులుసు, చేపల వేపుడు, ఫిష్ బిర్యానీ ఇలా వివిధ రకాలుగా తయారుచేసుకుంటారు. ఫిష్ తో ఫిష్ 65 చాలా టేస్ట్ గా ఉంటుంది. ఇది ఈవెనింగ్ స్నాక్ గా మరియు సైడ్ డిష్ గా కూడా అద్భుతంగా ఉంటుంది. పప్పు చారు, చారు వంటివి వండినప్పుడు సైడ్ డిష్ గా ఫిష్ 65 బెస్ట్ కాంబినేషన్. మరి మీరు కూడా ఫిష్ 65 రుచి చూడాలంటే ఈ క్రింది తయారుచేసే విధానంను తెలుసుకోవాల్సిందే...

కావల్సిన పదార్థాలు:
చేపముక్కలు: 4(శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి)
గుడ్డు : 1
పెప్పర్ : చిటికెడు
మైదా: 2 tsp
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp
కారం : 2tsp
గరం మసాలా పౌడర్: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
జీలకర్రపొడి : కొద్దిగా
ధనియాల పొడి : 1 tsp
నూనె: డీప్ ప్రైకి సరిపడా
తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో చేపముక్కలు, నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నింటినీ వేసుకొని బాగా మిక్స్ చేయాలి.
2. తర్వాత గుడ్డను కూడా పగలగొట్టి, పచ్చసొనతో పాటు వేసి బాగా మిక్స్ చేయాలి.
3. తర్వాత అందులో చేప ముక్కలన్నింటినీ వేసి బాగా మిక్స్ చేయాలి.
4. ఇలా మసాలా పట్టించిన చేపముక్కలను అరగంట పాటు ఫ్రిజ్ లో పెట్టిడితే మరింత టేస్ట్ ఉంటుంది.
5. అరగంట తర్వాత ప్రింజ్ లో నుండి బయటకు తీసి పెట్టుకోవాలి.
6. డీప్ ఫ్రైయింగ్ పాన్ లో నూనె వేసి, వేడయ్యకా, మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చేపముక్కలను నూనెలో వేసి అతి తక్కువ మంట మీద అన్ని వైపులు బ్రౌలన్ కలర్లో మారేవరకూ ఫ్రై చేసుకోవాలి.
7. ఇలా అన్ని చేపముక్కలను ఫ్రై చేసుకొన్న తర్వాత వాటిని ఒక పేపర్ టవల్ మీద వేస్తే అదనపు నూనె పీల్చుకుంటుంది. చేపముక్కలు మరింత టేస్ట్ గా ఉంటాయి. అంతే ఫిష్ 65 రెడీ. ఈ ఫిష్ 65ని స్నాక్ గా మరియు సైడ్ డిష్ గా ను తీసుకోవచ్చు. పప్పుచార, చారు వంటి వాటికి బెస్ట్ కాంబినేషన్ సైడ్ డిష్ గా చాలా టేస్ట్ గా ఉంటుంది.



Click it and Unblock the Notifications