Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
ఫ్రైడ్ ఎగ్ కోప్తా

కోడిగుడ్లు: 4
మిరియాలు: 1tsp
ఉప్పు: 1tsp
కోప్తాల తయారు చేయుటకు
బంగాళాదుంపలు: 4
క్యారెట్లు: 2
బీన్స్: 100grms
ఉల్లిపాయలు: 2
అల్లం: చిన్నముక్క
పచ్చిమిర్చి: 6
నిమ్మకాయ: 1
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: వేయించడానికి సరిపడా
తయారు చేయు విధానం:
1. కోఫ్తాలకోసం ఆలుగడ్డలను ఉడికించి మెత్తగా ముద్ద చేసి ఉంచాలి.
2. పాన్ లో నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అల్లంముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరవాత క్యారెట్ తురుము, సన్నగా తరిగిన బీన్స్ ముక్కలు అన్నీ కలిపి మూడు నిమిషాలు వేయించి ఆలూ ముద్ద కూడా వేసి ఫ్రై చేయాలి.
3. అందులోనే నిమ్మరసం, ఉప్పు వేసి మిశ్రమంలో బాగా కలిసే విధంగా కలిపి ప్రక్కకు దింపుకోవాలి. తర్వాత చిన్న ఉండలుగా చుట్టి కార్న్‌ఫ్లోర్(మొక్క జొన్నపొడి)లో దొర్లించాలి. తరవాత వీటిని నూనెలో వేయించి తీయాలి.
4. గిన్నెకు అడుగున కొద్దిగా నూనె పూసి కోడిగుడ్ల సొన, ఉప్పు, మిరియాలపొడి వేసి గిలకొట్టాలి.
5. ఇప్పుడు కోఫ్తాలు వేయించి తీసిన పాన్ లోనే కొద్దిగా నూనె ఉంచి, ఒక కప్పు గుడ్డుసొన మిశ్రమాన్నీ వేసి దాని మధ్యలో కోఫ్తాను ఉంచాలి. పక్కకు వచ్చిన గుడ్డు మిక్స్‌ను కోఫ్తా వైపు తిప్పుతుండాలి. ఇలా అన్ని కోఫ్తాల్ని ఫ్రై చేసి స్నాక్స్‌లా అందించండి.



Click it and Unblock the Notifications