Latest Updates
-
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా!
జిన్ జెర్ చికెన్

చికెన్ - 1/2 kg
వెల్లుల్లి పేస్ట్ - 1 tsp
అల్లం పేస్ట్ - 1 tsp
అల్లం - 1 పీస్ కట్ చేసినవి
ఉల్లిపాయలు - 2
టమోటో - 1
సోయా సాస్ - 2 tbsp
ఫిష్ సాస్ - 1 tsp (కావలసి వస్తే)
మిరియా పౌడర్ - 3 tsp
పచ్చిమిర్చి -4 కట్ చేసినవి
పసుపు -1/4 tbsp
యాలకలు-2
లవంగాలు -2
చెక్క - 1 పీస్
కొత్తిమిర - 1/2 cup (కట్ చేసినవి)
నూనె - కావలసినంత
ఉప్పు- రుచికి సరిపడా
మొక్కజొన్న పిండి - 1 tbsp
నీరు - 1/2 cup
తయారు చేయు విధానము:
1. చికెన్ ను చిన్న ముక్కలుగా కట్ చేసి నీటితో శుభ్రంచేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలను, టమోటాలను కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత చెక్క, లవంగం, యాలకలు ను కూడా పొడి చేసి పెట్టుకోవాలి.
2. స్టౌ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి అందులో చికెన్, కొద్దిగా ఉప్పు వేసి ఉడకబెట్టాలి. కొద్దిగా ఉడికిన తర్వాత పసుపు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా నీరు వేసి ఉడకనివ్వాలి. సగబాగం ఉడికిన తర్వాత అందులో నుండి చికెన్ ముక్కలను తీసి పక్కన పెట్టుకోవాలి.
3. మిగిలిన చికెన్ రసంలో మొక్కజొన్న పిండి చల్లి పెట్టాలి.
4. వేరొక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత దీనికి టమోటో, పొడిచేసి పెట్టుకొన్న లవంగం, చెక్క, యాలకలు పొడులు మరియు మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి డీప్ ప్రై చేయాలి.
5. తర్వాత చికెన్ ముక్కలో అందులో వేసి దానికి మొక్కజొన్న పిండి తో కలిపిపెట్టుకొన్న చికెన్ రసం వేసి బాగా చిక్కబడి దగ్గరయ్యే వరకూ ఉడకనివ్వాలి.
6. ఇప్పుడు అందులో సోయాసాస్ ను వేసి బాగా కలియబెట్టి స్టౌ మీద నుండి దింపుకొని, కట్ చేసి పెట్టుకొన్న కొత్తిమిర, ఉల్లిపాయలతోటి గార్నిష్ తో అలంకరించి సర్వ్ చేయాలి. అంతే జిన్ జర్ చికెన్ రెడీ.



Click it and Unblock the Notifications