Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
మాంసాహార ప్రియులకు గోవన్ ప్రాన్ కాల్డైన్

కావలసిన పదార్థాలు:
రొయ్యలు: 1/2kg
వైట్ వైన్ వెనిగర్: 2tbsp
పసుపు: 1/2tsp
నల్ల మిరియాలు: 1tsp
జీలకర్ర: 1tsp
ధనియాలు: 1tsp
గసగసాలు: 2tbsp
వేరుశెనగ నూనె: 4tbsp
ఉల్లిపాయ: 1(సన్నగా తరిగినవి)
వెల్లుల్లి రెబ్బలు: 4
అల్లం: చిన్న ముక్క
కొబ్బరిపాలు: 3tbsp
చింతపండు రసం: 4tbsp
పచ్చిమిర్చి: 4-6
కొత్తిమీర తరుగు: 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా రొయ్యల్ని శుభ్రం చేసి పెట్టుకోవాలి. తర్వాత వెనిగర్, అరచెంచా ఉప్పు కలిపి ఐదు నిమిషాల పాటు నాననివ్వాలి.
2. ఇంతలోపు మిరియాలు, ధనియాలు, జీలకర్ర, గసగసాల్ని తీసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి.
3. ఇప్పుడు పాన్ లో నూనె వేసి వేడి అయ్యాక అందులో సన్నగా తరిగి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, అల్లం పలుకులు వేయించాలి.
4. ఐదారు నిమిషాల అయిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పొడి కూడా వేసి రెండు నిమిషాలు వేయించాలి. ఇది మిశ్రమంలా తయారయ్యాక కొబ్బరిపాలు, చింతపండు రసం, పచ్చిమిర్చి, సరిపడా ఉప్పు చేర్చి తక్కువ మంటలో బాగా వేగనివ్వాలి.
5. ఇప్పుడు రొయ్యల్ని కూడా వేసి బాగా కలపాలి. ఐదు నిమిషాలకు కూర తయారవుతుంది. చివరగా కొత్తిమీర తరుగును చల్లి దింపేస్తే సరిపోతుంది. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది.



Click it and Unblock the Notifications