Latest Updates
-
మాతృ దినోత్సవం రోజున భార్య, అమ్మ మధ్య నలిగిపోతున్నారా? ఈ చిన్న ట్రిక్ పాటిస్తే గొడవలు ఉండవు! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణులు, పీరియడ్స్‌లో ఉన్న మహిళలు ఈ విషయాలు తెలియకపోతే ప్రమాదమే! -
విడాకుల కోసం కోర్టుకు వెళ్తున్నారా? ఏపీ హైకోర్టు తీసుకున్న ఈ కొత్త నిర్ణయం మిమ్మల్ని షాక్‌కు గురి చేస్తుంది! -
ఎండలు మండుతున్నాయి.. అకస్మాత్తుగా పిడుగులు పడతాయా? మీ కుటుంబం కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
మీ భోజనం రుచిని రెట్టింపు చేసే సీక్రెట్ పచ్చిమిర్చి పచ్చడి..అప్పటికప్పుడు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మే 8: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది.. ధనలాభం ఖాయం! -
గ్యాస్, అసిడిటీకి చెక్..పడుకునే ముందు ఇదొక గ్లాస్ తాగితే కడుపు ఉబ్బరం మాయం! -
మే 8న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన వర్షమే! -
గుజరాతీ స్పెషల్ జొన్న ఖీచూ..బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్లకు సూపర్! -
అన్నమయ్య 618వ జయంతి వేడుకలు: భక్తుల పరవశం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. ఈ విశేషాలు తెలుసా?
ఫిష్ గ్రీన్ మసాలా - సండే స్పెషల్

చేపలు: 1kg(కావలసిన సైజులో కట్ చేసినవి)
గ్రీన్ మసాలా: 4cups
ఆవనూనె లేదా సాధారణ నూనె: 1/4cup
అరిటాకులు(చేపలు తిరగేయ్యడానికి)
గ్రీన్ మసాలాకి కావలసిన వస్తువులు:
కొత్తిమీర: 2cups
పుదీనా: 2cups
వెల్లుల్లి రెబ్బలు: 25-30
అల్లం: పెద్ద ముక్క
పచ్చిమిర్చి: 10-15(రుచికి సరిపడా)
ఉల్లిపాయలు: 2(సన్నగా తరిగినవి)
దాల్చిన చెక్క: చిన్న ముక్క
గసగసాలు: 2tbsp
లవంగాలు: 8-10
తయారు చేయు విధానం:
1. ముందుగా గ్రీన్ మసాలా పదార్థాలన్నీ కలిపి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ లా తయారు చేసుకోవాలి. గట్టిగా పొడిపొడిగా ఉంటే కొద్దిగా నీళ్ళు పోసుకోవచ్చు.
2. చేప ముక్కలను, ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి రుద్ది, మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి.
3. తర్వాత చేపముక్కలకు తేమ ఆరిన తర్వాత గ్రీన్ మసాలను తీసుకొని చేపముక్కలకు బాగా పట్టించాలి. ఇలా అన్ని చేప ముక్కలకు గ్రీన్ మసాలా పట్టించిన తర్వాత ఒక గంట లేదా రెండు గంట పాటు పక్కన పెట్టుకోవాలి. అప్పుడు మసాలా చేపముక్కలకు బాగా పడుతుంది.
4. ఇప్పుడు అరిటాకును కావాల్సిన సైజ్ లో కట్ చేసుకొని అందులో రెండు చేప ముక్కలను పెట్టి ఒక టీస్పూన్ ఆవనూనె వేసి ఆకును చక్కగా మూసి దారంతో చుట్టాలి.
5. ఆ తర్వాత ఆవిరి మీద వీటిని ఉడికించాలి. అంతే వేడి వేడి గ్రీన్ మసాలా ఫిష్ రెడీ. వీటిని అన్నంతో సర్వ్ చేస్తే చాలా రుచికరంగా ఉంటాయి. టేస్ట్ కూడా వెరైటీగా అనిపిస్తుంది.



Click it and Unblock the Notifications