Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
హోం మేడ్ చికెన్ పకోడా: రంజాన్ స్పెషల్
రంజాన్ ముస్లింలకు పవిత్రమైన నెల..అత్యంత భక్తి శ్రద్దలతో నియమాలతో ఈ నెలలో ఉపవాసాలు చేస్తారు..సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ మంచి నీరైనా ముట్టరు. అంతే కాదు..ఎదుటి వ్యక్తికి తాము ఉపవాసం ఉన్నట్లు కూడా కనిపించరు. రోజువారీ విధుల్ని మా మూలుగానే నిర్వహిస్తుంటారు. నగర జీవితం బిజీబిజీ..ట్రాఫిక్ లో మరెన్నో ప్రతికూల పరిస్థితుల్లో ఉపవాసం ఉన్న వారు నిత్యజీవినం గడుపుతుంటారు. అందుకే సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత బలమైన ఆహారం తీసుకుంటే రోజంతా ఇబ్బంది ఉండదు.
ఎదుటి వారి ఆకలి తెలిసేలా చేసేది ఉపవాసం. అభిమానం అనే ఆకలిని పెంచేది ఇఫ్తార్. రంజాన్ మాసం అంటే తోటి వారిపై ప్రేమ చాటుకునే మాసం. వారిని ప్రేమగా గుండెలకు హత్తుకునే మాసం. ఈ మాసంలో ముస్లింలు ఇతర మతస్తులను ఇఫ్తార్ కు ఆహ్వానిస్తారు. అలాగే ఇతర మతస్తులు వారికి ఇఫ్తార్ విందు ఇస్తారు. రంజాన్ మాసంలో భక్తితో ఆచరించే ఉపవాసదీక్షలు విరమించే ఇఫ్తార్‌లో, ఆ తరువాత స్వీకరించే పదార్థాలు నోరూరిస్తాయి. అధిక పోషక విలువలు కలిగి ఉండే ఈ పదార్థాలకు రంజాన్ నెలలో ప్రత్యేక స్థానం ఉంది. జిహ్వ చాపల్యం కలిగిన ప్రతి ఒక్కరూ వీటిని రుచి చూడకుండా ఉండలేరు. అటువంటి వంటకాల్లో చికెన్ పకోడా ఒకటి. మరి దీన్ని ఇంట్లోనే చాలా సులభంగా ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
చికెన్ తయారీకి కావల్సినవి:
చికెన్: 1kg
జీలకర: వేయించి పొడి చేసింది : 1/2tsp
కారం: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
నిమ్మ ఉప్పు(లెమన్ డ్రెస్స్): 1tsp
పిండి తయారీకి కావల్సినవి
నీరు : 1cup
శనగపిండి: 1cup
బేకింగ్ పౌడర్: 1/2tsp
కారం: 1/2tsp
ఉప్పు: రుచికి సరిపడా
కరివేపాకులు : నాలుగు రెమ్మలు
పచ్చిమిర్చి: 2 (సన్నగా తరిగినవి)
తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక కప్పు నీటిలో కొద్దిగా ఉప్పు వేసి చికెన్ ముక్కలు ఉడకబెట్టాలి.
2. ఉడికిన తరువాత నీటిని పూర్తిగా వడపోసి జిలకర పొడి, ఉప్పు, నిమ్మ ఉప్పు, కారంలో బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి.
3. తరవాత ఒక గిన్నెలో శనగపిండిని బజ్జీలపిండిలా చిక్కగా కలుపుకొవాలి.
4. అందులోనే కరివేపాకు, తరిగిన పచ్చిమిర్చి, కారం, ఉప్పు తగినంత, బేకింగ్ పౌడర్ కలిపి చికెన్ ముక్కలను పిండిలో ముంచి నూనెలో బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. అంతే వేడి వేడి చికెన్ పకోడా రెడీ.



Click it and Unblock the Notifications