Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
హనీ -సోయా బ్రాయిల్డ్ సాల్మన్
హనీ సోయా బ్రాయిల్డ్ సాల్మన్ ఆసియా వంటకాల్లో ఒక ప్రధానమైన వంటకం. ఇది చేయడం చాలా సులభం.
తియ్య తియ్యగా, ఉప్ప ఉప్పగా.. కొద్దిగా వగరుగా ఉండే సోయా సాస్, రైస్ వెనిగర్ మరియు తేనె మిశ్రమంతో సాస్ చేసుకొని ఫిష్ ఫిల్లెట్ కు మ్యారినేట్ చేసి ఫ్రై చేసిన ఫిష్ చాలా రుచికరంగా ఉంటుంది. దానికి వేయించిన నువ్వులను గార్నిష్ చేయడం వల్ల మరింత రుచి, ఆకర్షణ కలిగి ఉంటుంది. దీన్ని వేడి వేడి అన్నంతో సర్వ్ చేయవచ్చు.

కావలసిన పదార్థాలు
ఉల్లిపాయ(చిన్న ఉల్లిపాయ): 1 (ముక్కలుగా కట్ చేసుకోవాలి)
సోయా సాస్: 2tbsp
రైస్ వెనిగర్: 1tbsp
తేనె: 1tbsp
అల్లం తురుము: 1tsp
సాల్మన్ ఫిష్ ఫిల్లెట్: 1kg(కావాల్సిన సైజ్ లో కట్ చేసుకోవాలి)
నువ్వులు: 1tsp(వేయించినవి)
తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక గిన్నెలో కట్ చేసిన చిన్న ఉల్లిపాయ కాడలు, సోయా సాస్, వెనిగర్, తేనె మరియు అల్లం తురుము వేసి బాగా కలుపుకోవాలి.
2. ఈ మిశ్రమాన్ని శుభ్రం చేసుకొన్న చేప ముక్కలకు, ముందుగా తయారు చేసుకొన్నసోయా సాస్ మిశ్రమాన్ని అన్నివైపులా రాయాలి. తర్వాత ఈ మ్యారినేట్ చేసిన చేపలను ఫ్రిజ్ లో అరగంట పాటు పెట్టుకోవాలి.
3. తర్వాత స్టౌ వెలిగించి, దాని మీద పాన్ పెట్టి దాని మీద కొద్దిగా నూనె వేసి వేడి అయిన తర్వాత ఫ్రిజ్ పెట్టిన చేప ముక్కలను తీసి పాన్ లో పెట్టి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించాలి. అన్ని వైపులా తిప్పుతూ బాగా కాలనివ్వాలి.
4. తక్కువ మంట మీద వేయించడం వల్ల ఫిష్ కు మారినేట్ చేసి సాస్ బాగా అంటి రుచిగా ఉంటుంది. ఫిష్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్ లోనికి తీసుకొని దాని మీద మిగిలిన సోయా సాస్ మిశ్రమాన్ని వేసి, వేయించిన నువ్వులను గార్నిష్ చేసి, సర్వ్ చేయాలి. అంతే హనీ సోయా బ్రాయిల్డ్ సాల్మన్ రెడీ..



Click it and Unblock the Notifications