Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
హాట్ అండ్ స్పైసీ గ్రీన్ చిల్లీ చికెన్ రిసిపి
ఎటువంటి సందేహం లేకుండా, మీరు ఒక మంచి చికెన్ రిసిపిని తినాలనుకుంటే, గ్రీన్ చిల్లీ చికెన్ అద్బుతమైన టేస్ట్ ను అందిస్తుంది. హాట్ అండ్ స్పైసీగా ఉండే ఈ గ్రీన్ చిల్లీ చికెన్ రిసిపిని చాలా సింపుల్ గా త్వరగా తయారుచేసుకోవచ్చు. ఇప్పటి వరకూ మనం రెడ్ చిల్లీ చికెన్ అదీ కూడా రెడ్ చిల్లీ మరియు సాస్ ఉపయోగించి తయారుచేసిన చికెన్ మాత్రమే రుచి ఉంటాము. కానీ గ్రీన్ చిల్లీ చికెన్ ను మీరు ఇప్పటి వరకూ రుచి చూసి ఉండరు?

చికెన్ వంటల్లో స్పెషల్ గా హాట్ అండ్ స్పైసీగా ఉండేది ఈ హాట్ అండ్ గ్రీన్ చిల్లీ చికెన్. కారం ఎక్కువగా తినేవారికి మరియు చికెన్ అంటే మరింత ఎక్కువ ఇష్టపడే వారికి ఇది ఒక స్పెషల్ ట్రీట్ అని చెప్పవచ్చు. ఈ వంటకోసం పచ్చిమిర్చిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. గ్రీన్ చిల్లీ యొక్క ఆరోమా వాసన, చికెన్ కాంబినేషన్ మైండ్ బ్లోయింగ్ ఫ్లేవర్ కలిగి ఉంటుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ చలికాలంలో మీ శరీరానికి వెచ్చదనం కలిగించే హాట్ అండ్ స్పైసీ గ్రీన్ చిల్లీ చికెన్ ఎలా తయారుచేయాలో తెలుసుకొనేద్దాం...రండి....

Serves: 4
Preparation time: 30 minutes
Cooking time: 30 minutes
కావల్సిన పదార్థాలు:
చికెన్: 1 kg
పచ్చిమిర్చి : 1cup(చిన్నది)
ఉల్లిపాయలు: 2 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
వెల్లుల్లి రెబ్బలు: 10
అల్లం: 1 మీడియం ముక్క
తాజా కొత్తిమీర: 1/2cup(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
ఉప్పు: రుచికి సరిపడా
పసుపు పొడి: 1tsp
ధనియాల పొడి : 2tsp
జీలకర్ర పొడి: 1tsp
గరం మసాలా పొడి: 1tsp
జీలకర్ర : 1tsp
నూనె: 3tbsp

తయారుచేయు విధానం:
1. ముందుగా ఉల్లిపాయలు, వెల్లుల్లి, కొత్తిమీర, మరియు పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు మిక్సీలో వేసి కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
2. తర్వాత ఈ పేస్ట్ ను చికెన్ ముక్కలకు పట్టించి ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి.
3. పాన్ లో కొద్దిగా నూనె వేసి కాగిన తర్వాత జీలకర్ర వేసి ఒక నిముషం వేగించుకోవాలి.
4. ఆ తర్వాత అందులోనే పచ్చిమిర్చి, ఉప్పు మరియు పచ్చిమిర్చి కలర్ మారేవరకూ వేగించుకోవాలి.
5. పచ్చిమిర్చి వేగిన తర్వాత అందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చికెన్ ముక్కలను వేసి, బాగా మిక్స్ చేస్తూ 10 నిముషాల పాటు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.

7. ఇప్పుడు ఉడుకుతున్న చికెన్ పాన్ కు మూత పెట్టి తక్కువ మంట మీద 10-15నిముషాల పాటు పూర్తిగా మెత్తగా ఉడికేవరకూ ఉడికించుకోవాలి.
8. గ్రేవీ బాగా చిక్కబడి చికెన్ మెత్తగా ఉడికిన తర్వాత మూత తీసి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి స్టౌ ఆఫ్ చేయాలి. అంతే హాట్ అండ్ స్పైసీ గ్రీన్ చిల్లీ చికెన్ రెడీ...
ఈ హాట్ అండ్ స్పైసీ గ్రీన్ చిల్లీ చికెన్ రిసిపిని రైస్ మరియు రోటీలకు మంచి కాంబినేషన్.

న్యూట్రీషియన్ విలువలు: ఎండుమిర్చితో పోల్చితే పచ్చిమిర్చి హానికరం కావని భావిస్తున్నారు. ఎందుకంటే ఇవి క్యాన్సర్ నుండి రక్షణ కల్పిస్తుంది, వ్యాధినిరోధకత పెంచుతుంది మరియు వీటిలో జీరో క్యాలరీలను కలిగి ఉంటుంది. అందువల్ల చిల్లీ చికెన్ రిసిపి హెల్తీ అని భావిస్తారు.
చిట్కా: మ్యారినేట్ చేసిన చికెన్ ఎంత ఎక్కువ సమయం ఫ్రిజ్ లో పెడితే అంత మెత్తగా సాఫ్ట్ గా ఉంటుంది.





Click it and Unblock the Notifications