Latest Updates
-
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి!
నోరూరించే కడాయ్ చికెన్ డ్రై

చికెన్ : 1/2kg
ఎండుమిర్చి: 4-6
పచ్చిమిర్చి: 4(మద్యలోకి కట్ చేసినవి)
వెల్లుల్లి రెబ్బలు: 5
అల్లం: 1tbsp
టమోటో: 1 కట్ చేసినవి
క్యాప్సికమ్: 1 కట్ చేసినవి
కారం: 1tbsp
ధనియా: 1tbsp
జీలకర్ర: 1tsp
గరం మసాలా: 1tbsp
నూనె: తగినంత
ఉప్పు: రుచికి తగినింత
తయారు చేయు విధానము:
1. మొదటగా చికెన్ శుభ్రం చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ను చికెన్ ముక్కలకు పట్టించి ఒక గంటపాటు పక్కన పెట్టాలి
2. ఇంతలోపు ఎండు మిర్చిని దోరగా వేయించి మిక్సర్ లో వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.
3. తర్వాత కడాయ్ లో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి.
4. ఇప్పుడు అందులో ముందుగా మారినేట్ చెయ్యబడి(అల్లంవెల్లుల్లిమిశ్రమంతో నానబెట్టిన) చికెన్ వేయాలి. ఐదు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి.
5. ఐదు నిమిషాల తర్వాత టమోటో ముక్కలను, గ్రైండ్ చేసి పెట్టుకొన్న ఎండుమిర్చి ను అందులో వేసి బాగా కలియబెట్టి మరి కొద్దిసేపు ఉడకనివ్వాలి.
6. ఇప్పుడు బాగా మొత్తగా వేగడానికి ఉప్పును కూడా వేసి బాగా కలియబెట్టాలి. తర్వాత కొద్ది సేపటికి పచ్చిమిర్చి, క్యాప్సికమ్ వేసి వేయించాలి.
7. స్పూన్ తో కలియబెడూతూ బాగా ఫ్రై చేయాలి అప్పుడే చికెన్ బాగా మెత్తగా ఉడుకుతుంది. కుక్కర్ ఉపయోగించాల్సిన అవసరం ఉండదు.
8. ఇప్పుడు, కారం, ధనియా, గరం మసాలా వేసి బాగా మిశ్రం అంతా కలిసేలా కలిపి కొద్దిసేపు మూత పెట్టి ఆవిరిలోనే ఉడకనివ్వాలి. కావలనుకొంటే కొద్దిగా నీటిని జతచేయవచ్చు. 10 నిమిషాల పాటు తక్కువ మంట మీద ఉడికిన తర్వత కొత్తిమీర తురుము చల్లి స్టౌ మీద నుండి దింపుకొని సర్వ్ చేయాలి అంతే కడాయ్ చికెన్ డ్రై రెడీ.



Click it and Unblock the Notifications