Latest Updates
-
ఇంట్లో శ్రీ చక్రం ఉంటే ఏమవుతుంది? ఆధ్యాత్మిక నిపుణులు చెప్పిన విషయాలు -
జూన్ 24 నుంచి తులా రాశిలో చంద్ర సంచారం: ఈ రాశుల వారికి అదృష్టం, ధన లాభం ఖాయం! -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ జాతకం ఎలా ఉంది? - బుధవారం, 24 జూన్ 2026 -
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.!
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి!
బెంగుళూరు అనగానే ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు టక్కున గుర్తొచ్చేది అక్కడి స్ట్రీట్ ఫుడ్. అందులోనూ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బెన్నె మసాలా దోశ(బట్టర్ మసాలా దోశ). దీని రుచి చూస్తే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. పైన కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉంటూ, స్వచ్ఛమైన వెన్న సువాసనతో నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే ఆ దోశను ఇష్టపడని వారుండరు.

ఎప్పుడూ రెస్టారెంట్లకు వెళ్లి తినడమే కాకుండా, అదే పక్కా బెంగుళూరు హోటల్ రుచితో మన ఇంట్లోనే చాలా సులభంగా ఈ దోశను తయారు చేసుకోవచ్చు. బెంగుళూరు స్టైల్ బెన్నె మసాలా దోశ మీ ఇంట్లో ఎలా తయారుచేసుకోవచ్చో ఇక్కడ చూడండి.
బెన్నె మసాలా దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు
దోశ బియ్యం - 2 కప్పులు (కటోరి)
ఉప్పుడు బియ్యం- పావు కప్పు
మినపప్పు - పావు కప్పు
మెంతులు - పావు టీస్పూన్
అటుకులు- పావు కప్పు
బియ్యం పిండి - 2 కప్పులు
చక్కెర - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - తగినంత
వెన్న - తగినంత
బెన్నె మసాలా దోశ తయారీ విధానం
-ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకోండి. అందులో 2 కప్పుల దోశ బియ్యం, పావు కప్పు ఉప్పుడు బియ్యం, పావు కప్పు మినపప్పు, పావు టీస్పూన్ మెంతులు వేయండి. వీటన్నింటినీ నీళ్లతో 3 నుండి 4 సార్లు శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత తగినన్ని మంచి నీళ్లు పోసి సుమారు 6 నుండి 7 గంటల పాటు బాగా నాననివ్వాలి.
-ఆరేడు గంటల తర్వాత నానబెట్టిన పప్పు, బియ్యం మిశ్రమంలోని నీటిని వంపేయండి.
-ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో నానబెట్టిన మిశ్రమాన్ని వేయాలి. దీనికి కడిగి పెట్టుకున్న పావు కప్పు అటుకులను కూడా జతచేసి, కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ చాలా మెత్తని పిండిలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ రుబ్బిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని, రాత్రంతా (కనీసం 8 గంటలు) పులియబెట్టాలి.
-మరుసటి రోజు ఉదయానికి పిండి బాగా పులిసి ఉంటుంది. ఇప్పుడు ఆ పిండిలో రుచికి సరిపడా ఉప్పు, 2 కప్పుల బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ల చక్కెర వేసి బాగా కలుపుకోవాలి. చక్కెర వేయడం వల్ల దోశకు ఆకర్షణీయమైన బంగారు రంగు (బ్రౌన్ కలర్) వస్తుంది. పిండి మరీ గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు కలుపుకుంటూ దోశల పిండి స్థిరత్వానికి సర్దుబాటు చేసుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి ఐరన్ (ఇనుప) పెనాన్ని పెట్టుకుని బాగా వేడి చేయండి. పెనం వేడెక్కాక గరిటెతో పిండిని తీసుకుని కాస్త మందంగా పెనం మొత్తం వ్యాపించేలా దోశ వేసుకోవాలి. దీనిపై కొద్దిగా నూనెతో పాటు, రుచిని రెట్టింపు చేసే తెల్ల వెన్నను వేయండి. మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి, దోశ అంచులు ఎర్రగా, కరకరలాడేలా వేగే వరకు కాల్చుకోవాలి.
-దోశ బాగా కాలి అద్భుతమైన రంగులోకి రాగానే, ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆలూ కర్రీ ను దోశ మధ్యలో ఉంచి రెండు వైపులా మడవాలి.
-అంతే ఘుమఘుమలాడే వేడి వేడి బెంగుళూరు స్టైల్ బెన్నె మసాలా దోశ రెడీ. ఈ దోశను వెంటనే మీకు ఇష్టమైన పల్లీ లేదా కొబ్బరి చట్నీతో సర్వ్ చేస్తే, ఆ రుచికి ఇంట్లో వాళ్లంతా వహ్వా అనాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications