Latest Updates
-
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా!
స్పెషల్ టేస్ట్ ఖీమా పరోటా

కావలసిన పదార్థాలు:
గోధుమపిండి: 1/2kg
మటన్ కీమా: 1/4kg
ధనియాలపొడి: 1tsp
గరం మసాల: 2tsp
ఉల్లిపాయలు: 2cups(సన్నని ముక్కలుగా తరుగుకోవాలి)
కారంపొడి: 1/2tsp
పసుపు: చిటికెడు
నూనె: 1cup
గుడ్డు: 1
కొత్తిమీర తరుగు: 1cup
అల్లంవెల్లుల్లి పేస్ట్: 1tbsp
ఉప్పు: రుచికి తగినంత
తయారు చేసే విధానం:
1. ముందుగా గోధుమపిండి జల్లించి, దానికి తగినంత ఉప్పు,నీళ్ళు కలిపి మెత్తగా పరోటా పిండి కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత ఖీమాను ఒక గిన్నెలో ఉప్పు వేసి మెత్తగా ఉడికించుకోవాలి.
3. స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి, కాగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి ఎర్రగా వేయించుకోవాలి.
4. ఇప్పుడు అందులోనే అల్లంవెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ధనియాలపొడి, గరం మసాలా పొడి వేసి ఉడికించిన ఖీమాను కూడా కలిపి ఫ్రై చేయాలి.
ఇలా తయారైన ఖీమా ఫ్రై పైన కొత్తిమీర చల్లుకోవాలి.
ఖీమా పరోటా తయారీ:
1. ఇప్పుడు కలిపి పెట్టుకున్న గోధుమపిండి ముద్దని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఈ వుండ మధ్యలో ఖీమా ఫ్రై ని పెట్టి, కవర్ చేసి చపాతీ కర్రతో పలుచగా వత్తుకోవాలి.
2. ఇలా అన్నింటిని తయారు చేసి పెట్టుకొన్న తర్వాత స్టౌ మీద చపాతీ పాన్ పెట్టి వేడయ్యాక కొంచెం నూనె వేసి ఖీమా పరోటాను వేసి ఎర్రగా కాల్చుకోవాలి. అంతే కీమా పరోటా రెడీ.
ఈ ఖీమా పరోటాలను నాన్ వెజ్ కర్రీ,పెరుగు రైతాలతో తింటే బాగుంటుంది.



Click it and Unblock the Notifications