Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
కట్టా మీట: కాశ్మీర్ మటన్ రిసిపి: కాశ్మీర్ స్పెషల్
కట్టా మీట్ రిసిపిని ఇండియన్ మటన్ రిసిపిలలో కాశ్మీరీ మటన్ రిసిపి టాప్ లో ఉంటుంది. ఈ కాశ్మీరి మటన్ రిసిపి ఇతర మటన్ రిసిపిల కంటే డిఫరెంట్ గా ఉంటుంది. కట్టా మీట్ మటన్ రిసిపి ఒక డిఫరెంట్ సోర్ టేస్ట్ ను కలిగి ఉంటుంది. సాధారణంగా ఇది కారంగా ఉన్నకొద్దిగా పుల్లని టేస్ట్ ను ఇస్తుంది.
కట్టా మీట్ మటన్ రిసిపి సోర్ ప్లేవర్ ను అందిస్తుంది. ఎందుకంటే ఇందులో డ్రై మ్యాంగో పౌడర్ ను జోడిస్తాము కాబట్టి. కాశ్మీరి మటన్ రిసిపిని తయారుచేయడం చాలా సులభం మరియు ఈ వంట రైస్ మరియు రోటీలకు మంచి కాంబినేషన్ మరియు ఈ స్పెషల్ కాశ్మీరి మటన్ రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
మటన్-750 గ్రాముల (మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయలు: 3 (సన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
జీలకర్ర: 2 tsp
లవంగాలు -4
చెక్క : 1 అంగుళం
బ్లాక్ యాలకులు: 2
కసూరి మెంతి: 1tbsp
పసుపు: ½ tsp
కాశ్మీరీ మసాలా: 1tsp
అల్లం మరియు వెల్లుల్లి - 2tbsp(ముక్కలు)
ఎండు మిర్చి: 2
పచ్చిమిర్చి: 4 (స్ప్లిట్)
డ్రై మ్యాంగో పౌడర్: 3tbsp
సోంపు పొడి : ½tsp
ఆవ నూనె: 2 tbsp
కొత్తిమీర తరుగు: కొద్దిగా (సన్నగా తరిగినది)
ఉప్పు:రుచికి సరిపడా
తయారుచేయు విధానం:
1. ముందుగా మస్టర్డ్ ఆయిల్ కుక్కర్ లో వేసి, వేడయ్యాక అందులో, లవంగాలు, జీలకర్ర, దాల్చిన చెక్క మరియు బ్లాక్ యాలకులు వేసి వేయించుకోవాలి.
2. ఈ మసాలా దినుసులు వేగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి, 5నిముషాలు తక్కువ మంట మీద వేయించుకోవాలి.
3. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి మరో 2,3నిముషాలు వేయించుకోవాలి.
5. ఇప్పుడు అందులో మెంతి ఆకు తరుగు, పసుపు మరియు కాశ్మిరీ మసాలా వేసి బాగా మిక్స్ చేస్తూ వేయించుకోవాలి.
6. తర్వాత అందులో ఎండు మిర్చి వేసి ఒక కప్పు నీళ్ళు పోసి ఉడికించుకోవాలి.
7. మంట పూర్తిగా తగ్గించి, అందులో మటన్ ముక్కలు కూడా వేసి 10నిముషాలు మీడియం మంట మీద వేగించుకొని, తర్వాత రెండు మూడు కప్పులు నీళ్ళు పోసి మిక్స్ చేసి ఉప్పు కూడా జోడించి బాగామిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టి ఉడికించుకోవాలి.
8. రెండు మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి. మటన్ మెత్తగా ఉడికిన తర్వాత అందులో డ్రై మ్యాంగో పౌడర్ మరియు పచ్చిమిర్చి మరియు సోంపు వేసి మిక్స్ చేయాలి.
9. మంట పూర్తిగా తగ్గించి, మరికొద్దిసేపు ఉడికించుకోవాలి, తర్వాత కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకోవాలి. అంతే కట్టా మీట్ కాశ్మీర్ మటర్ రిసిపి రెడీ. దీన్ని రోటీ లేదా రైస్ తో సర్వ్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది.



Click it and Unblock the Notifications