కోరి రోటీ..మంగళూరు స్పెషల్..

ధక్షిణ భారత దేశంలో మంగళూరు వంటకాలు చాలా ప్రసిద్ది. ముఖ్యంగా మాంసాహార వంటకాలు. అందులో సీ ఫుడ్ చాలా పాపులర్. మాసాహార వంటకాల్లో వెరైటీగా రుచి చూడాలంటే మంగళూరు వంటకాల్ని ఇంట్లో ప్రయత్నించవచ్చు. ఈ మంగళూరు మాంసాహార వంటలు కారం కారంగా రుచి... మంచి రంగుతో ఘుమఘుమలాడుతుంటాయి.

Kori Rotti: Mangalorean Recipe

మంగళూరులో కోరి రోటి చాలా ఫేమస్ వంటకం. కోరి అంటే చికెన్ మరియు రోటి.. రోటీని గోధుమ పిండితో తయారు చేస్తారు. అయితే మంగళూరులో తయారు చేసే రోటీలు బియ్యం పిండితో తయారు చేస్తారు. ఈ రోటిలో కరకరలాడుతుంటాయి. వీటికి కోరి(చికెన్)గ్రేవీ పడగానే సుతిమెత్తగా మారి నోట్లో వేసుకోగానే కరిగిపోయే విధంగా ఉండి, అద్భుతమైన టేస్ట్ ను ఇస్తుంది . కాబట్టి మీరు చికెన్ వంటకాల్లో వెరైటీ రుచిచూడాలంటే ఈ మంగళూరియన్ చికెన్ రిసిపిని ప్రయత్నించండి...

కావలసిన పదార్థాలు
చికెన్: 1kg(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయ: 1(కట్ చేసుకోవాలి)
కొబ్బరిపాలు: 1/2cup
అల్లం: చిన్న ముక్క(ముక్కలుగా కట్ చేసుకోవాలి)
వెల్లుల్లి రెబ్బలు: 5-6
జీలకర్ర: 1tsp
లవంగాలు: 4-6
చెక్క: చిన్న ముక్క
యాలకులు: 3-4
ఎండు మిర్చి: 4-5
కొబ్బరి తురుము: 2tbsp
పసుపు: చిటికెడు
కారం: 1tbsp
చింతపండు: గోలిఅంత
కరివేపాకు: రెండు రెమ్మలు
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 1cup

తయారు చేయు విధానం:
1. ముందుగా స్టౌ మీద ఫ్రైయింగ్ పాన్ పెట్టి, నూనె వేసి వేడియ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు నిముషాలు వేయించుకోవాలి. వేగిన ఉల్లిపాయ ముక్కలను సగం ప్లేట్ లోనికి తీసి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు మరో పాన్ లో మరికొంత నూనె వేసి అందులో వేయించిన ధనియాలు, ఎండు మిర్చి, జీలకర్ర, కొబ్బరి తురుము, అల్లం వెల్లుల్లి, లవంగాలు, చెక్క, అన్నింటిని ఒక నిముషం పాటు వేయించాలి.
3. వేయించుకొన్న మసాలా దినుసుల్లో, వేయించిన వెల్లుల్లిపాయలు కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ లో కొద్దిగా పసుపు, చింతపండు, కొబ్బరి పాలు, కొద్దిగా నీళ్ళు చేర్చ మరొక సారి బ్లెడ్ చేయాలి.
4. ఇప్పుడు ముందుగా వేయించుకొన్న ఉల్లిపాయ ముక్కల పాన్ వేడి చేసి, అందులోనే గ్రైడ్ చేసుకొన్న మసాలా పేస్ట్ ను వేసి ఐదు నిముషాలు వేయించుకొన్న తర్వాత చికెన్ ముక్కలను కూడా వేసి బాగా మిక్స్ చేసి వేయించాలి. ఉప్పు కూడా వేసి వేయించాలి.
5. ఇప్పుడు మరికొంచెం కొబ్బరి పాలు కూడా పోసి, కొద్దిగా నీళ్ళు చేర్చి బాగా కలియబెట్టి చికెన్ ను మెత్తగా ఉడికించాలి. చికెన్ ఉడికి గ్రేవీ చిక్కబడేంతవరకూ ఉడికించి స్టౌ ఆఫ్ చేసి సర్వ్ చేయాలి. అంతే మంగళూర్ చికెన్ రిసిపి రెడీ....

Story first published: Saturday, October 13, 2012, 17:52 [IST]
Desktop Bottom Promotion