లెమన్ జింజర్ గ్రిల్డ్ చికెన్

చికెన్ స్పెషల్ వంటకాల్లో గ్రిల్డ్ చికెన్ చాలా ఫేమస్. ఆల్ టైమ్ హిట్ డిన్నర్. అందులో నిమ్మరసం, అల్లం పేస్ట్ తో తయారు చేసే ఈ గ్రిల్డ్ చికెన్ మరింత టేస్ట్ గా ఉంటుంది. ఈ హెల్తీ చికెన్ వంటకానికి పది మసాలా దినుసులు కూడా పట్టవు. అతి తక్కువ పదార్థలతో తయారయ్యే ఈ చికెన్. అయితే నిమ్మరసం, అల్లంతో తయారు చేసే ఈ గ్రిల్డ్ చికెన్ కు కొంచెం సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. కాబట్టి చికెన్ ఉంటే చాలు, మిగిలిన పదార్థాలు ఇంట్లో ఎప్పుడూ ఉండేవే కాబట్టి ఎప్పుడైనా సరే గ్రిల్డ్ చికెన్ తయారు చేసుకోవచ్చు. కాబట్టి ఈ గ్రిల్డ్ చికెన్ ఎలా తయారు చేయాలో చూద్దాం...

Grilled Chicken

కావలసిన పదార్థాలు:
చికెన్(మీడియం సైజ్ చికెన్ కోడి మొత్తం): 1
నిమ్మకాయలు: 2
అల్లం: 50grms(పేస్ట్ చేసుకోవాలి)
పెప్పర్(నల్ల మిరియాల పొడి): 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా
ఆలివ్ ఆయిల్: 2tbsp
కొత్తిమీర: 1cup(చిన్నగా కట్ చేసుకోవాలి)

తయారు చేయు విధానం:
1. ముందుగా చికెన్ మొత్తాన్ని బాగా శుభ్రం చేసి వేడినీళ్ళతో కడాగాలి. చికెన్ కట్ చేయకుండానే పొట్టలోపలి భాగం అంతా తొలగించి మొత్తాన్ని శుభ్రం చేసి ఒక ప్లేట్ లో తీసి పెట్టుకొని తడి పూర్తిగా ఆరనివ్వాలి.
2. చికెన్ పూర్తిగా ఆరిన తర్వాత కోడి మొత్తానికి అక్కడక్కడ కత్తితో చిన్న చిన్న గాట్లు పెట్టాలి. అలా చేయడం వల్ల స్పైసీ బాగా అంటుతాయి.
3. చికెన్ మొత్తం మీద రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా రబ్ చేయాలి. నిమ్మకాయలను సగానికి కట్ చేసి, నిమ్మ కాయతో ఉప్పును చికెన్ మెత్తానికి సర్ధాలి.
4. తర్వాత అల్లం పేస్ట్ ను తీసుకొని చికెన్ మొత్తం మీద నిమ్మరసం ఆరిన తర్వాత అల్లం పేస్ట్ ను పూతలా పూయాలి.
5. తర్వాత చికెన్ మొత్తం మీద పెప్పర్ పౌడర్ ను చిలకరించాలి. ఇలా తయారైన చికెన్ ను ఒక గంట పాటు ప్రిజ్ లో పెట్టాలి.
6. ఒక గంట తర్వాత ప్రిజ్ లో నుండి చికెన్ తీసి, ఆ గిన్నెలో ఉన్న నీటిని వంపేసి మళ్ళీ ప్రెష్ గా కొద్దిగా స్పైసీస్ ను జోడించాలి.
7. చికెన్ గ్రిన్ చేసే ముందుగా మరికొంత నిమ్మరసం, పెప్పర్ మరియు ఉప్పు చిలకరించి పక్కన పెట్టుకోవాలి.
8. తర్వాత ఒక పొడవాటి ఇనుప చువ్వను తీసుకొని, మసాలా పట్టించి పెట్టిన కోడికి మద్యలో నుండి గుచ్చాలి. తర్వాత చికెన్ మీద కొద్దిగా ఆలివ్ ఆయిల్ ను చిలకరించాలి.
9. ఇప్పుడు మైక్రోవోవన్ ను 250డిగ్రీల సెంటీగ్రేడ్ లో పెట్టి మైక్రోవొవెన్ లో చికెన్ గ్రిల్ చేయాలి. 80శాతం పవర్ మీద అరగంట పాటు బాగా కాల్చాలి.
10. రోస్టింగ్ గ్రిల్ ఉన్నట్లేతే మీరు చికెన్ ను ఇటూ అటూ తిప్పాల్సిన పని ఉండందు. అదే రొటేట్ అవుతుంది. లేదంటా మీరే అన్నిప్రక్కలా తిప్పుతూ చికెన్ బాగా బేక్ చేయాలి.
11. బాగా కాలిన తర్వాత ఒక పది, ఇరవై నిముషాల పాటు అలాగే ఉంచి, ఆతర్వాత బయటకు తీసి, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. ఏదేని సలాడ్ లేదా నిమ్మకాయ, ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేస్తే రుచికరంగాఉంటుంది.

Story first published: Saturday, October 27, 2012, 16:41 [IST]
Desktop Bottom Promotion