Latest Updates
-
జేబులో ఉల్లిపాయ పెట్టుకుంటే వడదెబ్బ తగలదా? -
సూరత్‌లో దారుణం: భార్యను సిమెంట్ బాక్సులో దాచిన భర్త.. బంధాల్లో ఈ 'రెడ్ ఫ్లాగ్స్' కనిపిస్తే జాగ్రత్త! -
షుగర్ ఫ్రీ పుదీనా లస్సీ.. వేసవిలో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం! -
వేసవి తాపాన్ని తగ్గించే సత్తు లడ్డూ.. ఈ ఎండలకు బెస్ట్ స్వీట్ ఇదే! -
NEET UG 2026 అడ్మిట్ కార్డులు వచ్చేసాయి.. పరీక్షలో విజయం సాధించాలంటే ఈ చివరి నిమిషం జాగ్రత్తలు తప్పనిసరి! -
పాలు వద్దు, పంచదార వద్దు.. పటిక బెల్లంతో 10 నిమిషాల్లో సూపర్ టేస్టీ రవ్వ లడ్డు! -
ఏప్రిల్ 27 రాజయోగం: ఈ రాశుల వారికి ధన యోగం.. ఇక తిరుగులేదు! -
ఈ చేప మగాళ్లకు సర్వరోగ నివారిణి..ఒకేసారి బలం,ఓపిక వచ్చేస్తుంది! -
రాఘవ్ చద్దా స్పెషల్ మ్యాంగో షేక్.. ఐదు నిమిషాల్లో ఈజీగా చేసుకోండిలా..బరువు పెరిగే టెన్షన్ లేదు! -
వడగాల్పుల ఎఫెక్ట్: ఎండల నుంచి ప్రాణాలను కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
లోఫ్యాట్ దహీ చికెన్-రైస్ కాంబినేషన్
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఆరోగ్యరంగా తినాలని కోరుకుంటారు. ఆరోగ్యంగా తినాలంటే పూర్తి పోషకాంశాలతో ఉన్న ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి . అలాగే లోక్యాలరీ ఫుడ్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. బరువు తగ్గాలి, కొవ్వును కరిగించుకోవాలని అనారోగ్యకరమైన ఆహారాలను ఏమాత్రం తినకుండా నివారించాలి. డైటింగ్ లో ఉన్నా కూడా ఎక్కువ న్యూట్రీషియన్ ఫుడ్ ను తినాలి. దాంతో మీరు ఎనర్జిటక్ గా ఉంటారు.
ఇక్కడ ఒక లోక్యాలరీ చికెన్ రిసిపి ఉంది. చాలా మంది క్యాలరీలు తగ్గించుకోవాలనుకుంటారు. అదే సమయంలో రుచికరంగా తినాలనుకుంటారు. అటువంటి వారికోసం ఇది ప్రత్యేకంగా తయారుచేయబడింది. ఈ లోఫ్యాట్ దహీ చికెన్ ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
చికెన్: ½kg(ఎముకలు లేని చికెన్ ముక్కలు)
లో ఫ్యాట్ పెరుగు: 2 ½ cups
ఉల్లిపాయలు: 2 (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
టమోటా: 1 (చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
జీలకర్ర పొడి: 2tsp
పసుపు: ½tsp
కారం: ½tsp
గరం మసాలా పొడి: ½tsp
పచ్చిమిరపకాయలు: 2 (మద్యకు కట్ చేయాలి)
వెల్లుల్లి పేస్ట్: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 1tbsp
కొత్తిమీర: 2tbsp(చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
నీళ్ళు: 1cup
తయారుచేయు విధానం:
1. ముందుగా చికెన్ ముక్కలను శుభ్రం చేయాలి.
2. జీలకర్రపొడి, వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పసుపు, కారం, గడ్డ పెరుగతో మిక్స్ చేయాలి.
3. ఈ మిశ్రమంలో చికెన్ ముక్కలు కూడా వేసి బాగా మిక్స్ చేసి మసాలా చికెన్ ముక్కలకు బాగా పట్టించి అరగంట పక్కన పెట్టుకోవాలి.
4. అరగంట తర్వాత, పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి ఐదు నిముషాలు ఫ్రై చేయాలి.
5. తర్వాత టమోటో ముక్కలు కూడా వేసి 4-5నిముషాలు టమోటో ముక్కలు మెత్తబడే వరకూ వేగించుకోవాలి.
6. ఇప్పుడు అందులోనే మ్యారినేట్ చేసి పెట్టుకొన్న, మిగిలిన మ్యారినేట్ మిశ్రమం కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.
7. చికెన్ ముక్కలను పది నిముషాలు వేగించుకొన్న తర్వాత అందులో ఉప్పు, నీళ్ళు కూడా చేర్చి బాగా మిక్స్ చేయాలి.
8. ఇప్పుడు మూత పెట్టి మీడియం మంట మీద 20నిముషాలు ఉడికించుకోవాలి.
9. చికెన్ ముక్కలు మొత్తగా ఉడికినతర్వాత స్టౌ ఆఫ్ చేసి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి పక్కన దింపుకోవాలి. అంతే లోఫ్యాట్ దహీ చికెన్ రిసిపి రెడీ. దీన్ని వేడి వేడి అన్నం లేదా రోటీలతో తినవచ్చు.



Click it and Unblock the Notifications