Latest Updates
-
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్ -
మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.! -
కేవలం 10 నిమిషాల్లో స్వర్గాన్ని చూపించే వెల్లుల్లి కారం ఆమ్లెట్..ఎలా చేసుకోవాలంటే.. -
బీహారీ స్పెషల్ చోఖా..పొలం గట్టు మీద కూర్చొని ఈ పచ్చడి కలిపి అన్నం తింటుంటే స్వర్గమే! -
నిమజ్జనం రోజు గణేశుడి చెవిలో ఈ 3 పదాలను చెప్పండి.. మీ తీరని కోరిక నెరవేరడం పక్కా.! -
రాత్రి మిగిలిన చపాతీలతో అదిరిపోయే బ్రేక్ఫాస్ట్.. పదే నిమిషాల్లో ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్.!
జేబులో ఉల్లిపాయ పెట్టుకుంటే వడదెబ్బ తగలదా?
మండే ఎండలతో వేసవి కాలం తీవ్రరూపం దాల్చుతోంది. ఉదయం 8 గంటలకే భానుడు భగభగమంటున్నాడు. వడదెబ్బ, డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు రకరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చల్లటి డ్రింక్స్ తాగుతూ, ఎండలోకి వెళ్లకుండా ఎవరికి వారే హోం రెమెడీస్ పాటిస్తున్నారు. అయితే కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వేడి నుంచి తప్పించుకునేందుకు పాటిస్తున్న ఒక వినూత్నమైన చిట్కా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

మధ్యప్రదేశ్‌లోని శివపురిలో తాజాగా జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన తన జేబులోంచి ఒక ఉల్లిపాయను తీసి అందరినీ ఆశ్చర్యపరిచారు. 50 డిగ్రీల ఎండలోనూ నా శరీర ఉష్ణోగ్రతను నియంత్రించి, నన్ను చల్లగా ఉంచేందుకు నేను ఎప్పుడూ జేబులో ఒక ఉల్లిపాయను పెట్టుకుంటాను అని ఆయన చెప్పడం నవ్వులు పూయించడంతో పాటు సరికొత్త చర్చకు దారితీసింది. ఇంతకీ జేబులో ఉల్లిపాయను ఉంచుకుంటే నిజంగానే వడదెబ్బ తగలదా? ఇది శాస్త్రీయంగా నిరూపించబడిందా లేక కేవలం అపోహ మాత్రమేనా?
ఉల్లిపాయలో ఆరోగ్య రహస్యాలు
పలు రిపోర్ట్ లు, నిపుణులు తెలిపిన ప్రకారం..ఉల్లిపాయలో క్వెర్సెటిన్ అనే సమ్మేళనం ఉంటుంది. దీనికి యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది వేసవిలో వచ్చే అలర్జీలు, శ్వాసకోశ సమస్యలను అరికట్టడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఉల్లిపాయకు సహజంగానే చల్లబరిచే గుణం ఉంది. వడదెబ్బ నుంచి కాపాడి, శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంలో ఇది సహాయపడుతుంది.
జేబులో ఉల్లిపాయ..సైన్స్ ఏం చెబుతోంది?
ఉల్లిపాయ వల్ల లాభాలు ఉన్నప్పటికీ జేబులో ఉల్లిపాయను పెట్టుకుంటే వడదెబ్బ తగలదు అనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. జేబులో ఉల్లిపాయ పెట్టుకున్నంత మాత్రాన అది మీ శరీర ఉష్ణోగ్రతను తగ్గించదన్నారు. పాతకాలంలో ఉల్లిపాయ శరీరంలోని వేడిని లాగేసుకుంటుందని ప్రజలు నమ్మేవారు. కానీ ఇది కేవలం తరం నుంచి తరానికి వ్యాపించిన ఒక మూఢనమ్మకం మాత్రమేనని ఆహార నిపుణులు కొట్టిపారేస్తున్నారు.
నిజానికి ఉల్లిపాయ ఎలా పనిచేస్తుంది?
ఉల్లిపాయలు శరీరాన్ని చల్లబరుస్తాయి.. కానీ అవి మీ జేబులో ఉన్నప్పుడు కాదు, మీ కడుపులోకి వెళ్లినప్పుడు. ఉల్లిపాయలో నీటి శాతం, ఎలక్ట్రోలైట్లు (పొటాషియం, సోడియం), యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
కాబట్టి ఎండాకాలంలో పచ్చి ఉల్లిపాయను సలాడ్స్ లేదా మజ్జిగ అన్నం రూపంలో తీసుకుంటే, అది చెమట పట్టడాన్ని మెరుగుపరిచి శరీరం డీహైడ్రేట్ కాకుండా చూస్తుంది. అయినప్పటికీ ఇది వడదెబ్బ నుంచి 100 శాతం రక్షణ ఇస్తుందని చెప్పలేం.
వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి అసలైన శాస్త్రీయ మార్గాలు
-దాహం వేసినా వేయకపోయినా రోజుకు కనీసం 3- 4 లీటర్ల నీరు తప్పకుండా తాగాలి.
-కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం, ఓఆర్ఎస్ (ORS) తీసుకుంటూ ఉండాలి. ఇవి ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ చేస్తాయి.
-దోసకాయ, పుచ్చకాయ, కర్బూజా వంటి నీటి శాతం అధికంగా ఉండే పండ్లను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి.
-ఎండలోకి వెళ్లేటప్పుడు నలుపు రంగు కాకుండా వదులుగా ఉండే, లేత రంగు (ముఖ్యంగా తెలుపు) కాటన్ దుస్తులు ధరించడం ఉత్తమం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
