Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
మంగళూరు ఫిష్ కర్రీ: సౌంత్ ఇండియన్ స్పెషల్
ఫిష్‌తో చేసిన ఐటమ్స్ తినడానికేం...? చేప ఈదినంత వీజీగా రెండు చేతులా ఎడాపెడా ఆరగించవచ్చు. కాకపోతే కాస్త ముల్లూ గిల్లూ చూసుకోవాలంతే. ఫిష్ కర్రీ తయారు చేయడం చాలా సులభం. అది మంగళూర్ ఫిష్ కర్రీలు, ఫ్రైలు చాలా వెరైటీ రుచులతో ఉంటాయి. అక్కడికి వెళ్ళ పర్యాటకుల ఇలాంటి రుచులును చాలా ఇష్టంగా తింటుంటారు. మంగళూర్ స్పెషల్ కొబ్బరి పాలతో తయారు చేసే వారి వంటలు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఫిష్ కర్రీకి సౌత్ ఇండియన్ స్పైసీ కలిపితే మరింత రుచికరంగా ఉండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అటువంటి రుచిని మనం ఇట్లో తయారు చేసుకొనొ మంగళూర్ రుచులను ఆస్వాదిద్దాం..
ఫిష్: ½kg
ఉల్లిపాయలు: 2(సన్నగా కట్ చేసుకోవాలి)
ధనియాలు: 2tbsp
ఎండు మిర్చి: 9 to 10
కొబ్బరి తురుము: 2 cups
అల్లం: చిన్న ముక్క
చింత గుజ్జు: 2tbsp
పచ్చిమిర్చి: 5-6(మధ్యకు కట్ చేసుకోవాలి)
కొబ్బరి పాలు: 1/2 cup(పచ్చికొబ్బరిని తురిమి గ్రైడ్ చేసి అందులో నీరు పోసి వడగట్టుకోవాలి)
నూనె: 2tbsp
గరం మసాలా: 1tbsp
పసుపు: చిటికెడు
ఉప్పు: రుచికి సరిపడా

తయారు చేయు విధానం:
1. ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడిచేయాలి. ఇప్పుడు అందులో ఎండు మిర్చి మరియు ధనియాలు వేసి లైట్ గా వేయించుకోవాలి.
2. తర్వాత ఒక కప్పు నీటిని వేడి చేసి అందులో చింత పండు వేసి ఐదు నిముషాలు నానబెట్టి తర్వాత చేత్తో బాగా కలిపి గుజ్జు తయారు చేసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు వేయించి పెట్టుకొన్న ఎండు మిర్చి, ధనియాలు, కొబ్బరి పాలు, చింత గుజ్జు, అల్లం వేసి మెత్తగా గ్రైడ్ చేసుకోవాలి.
4. తర్వాత పాన్ లో నూనె వేసి ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. తర్వాత పేస్ట్ చేసి పెట్టుకొన్ని మసాల ముద్దను వేసి ఫ్రై చేయాలి.
5. అందులోని పసుపు, గరం మసాలా, ఉప్పు వేసి ఫ్రై చేయాలి. తర్వాత రెండు కప్పుల నీళ్ళు పోసి బాగా ఉడికించాలి.
6. గ్రేవి బాగా ఉడికి చిక్కబడే సమయంలో చేప ముక్కలను వేసి ఐదు నుండి పది నిముషాల మాత్రమే ఉడికించుకోవాలి. అంతే మంగళూర్ ఫిష్ కర్రీ రెడీ.



Click it and Unblock the Notifications