Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
ముర్గ్ ముస్లమ్- స్పైసీ చికెన్ రిసిపి
ముర్గ్ ముస్లం ఒక ఉత్తమ స్పైసీ చికెన్ రిసిపి, ఈ అద్భుతమైన రుచికలిగిన చికెన్ రిసిపి చాలా రిచ్ గా మరియు క్రీమీగా ఉంటుంది. చూస్తూనే నోరూరించేట్లు ఉండే ఈ ముర్గ్ ముస్లం చికెన్ రిసిపి నార్డ్ ఇండియాలో చాలా ఫేమస్ రిసిపి. ఈ చికెన్ రిసిపిని ఎక్కువగా ఫెస్టివల్స్, మ్యారేజీలుకు ఎక్కువగా తయారుచేసుకుంటుంటారు.
ముర్గ్ ముస్లంను వివిధ రకాల ఇండియన్ మసాలా దినుసులతో తయారుచేస్తారు. ఈ మసాలాలు ఈ వంటకు ఒక స్పెషల్ టేస్ట్ మరియు ఫ్లేవర్ ను అంధిస్తాయి. అలాగే ఇందులో వేసి బాదం పేస్ట్ మరింత చిక్కదనాన్ని మరియు మంచి ఫ్లేవర్ ను అంధిస్తుంది. మరి ఈ స్పెషల్ టేస్టీ ముర్గ్ ముస్లంను ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
చికెన్: 1kg(మీడియం సైజ్ లోకి కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయలు: 2 (పెద్దది, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
వెల్లుల్లి రెబ్బలు: 4 లవంగాలు(ముక్కలుగా కట్ చేసుకోవాలి)
టమోటాలు: 2 (పెద్దవి/పేస్ట్ చేసుకోవాలి)
కారం: 1tsp
బాదాం: 10 (గోరువెచ్చని నీటిలో నానబెట్టుకోవాలి)
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 2tbsp
నీళ్ళు: 2 cups
కొత్తిమీర: 2tbsp(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
డ్రై రోస్ట్ కోసం:
మిరియాలు: ½tsp
జీలకర్ర: ½tsp
ధనియాలు: 1tsp
దాల్చిన చెక్క : చిన్న ముక్క
లవంగాలు : 4
ఏలకుల: 2
మ్యారినేషన్ కోసం
అల్లం-వెల్లుల్లి పేస్ట్: 1tbsp
పచ్చి మిర్చి పేస్ట్: 2tsp
పెరుగు: 1cup
కారం: ½tsp
పసుపు: ½tsp
తయారుచేయు విధనాం:
1. ముందుగా చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.
2. తర్వాత పైన లిస్ట్ లో తీసుకొన్న మ్యారినేట్ పదార్థాలన్నింటిని ఒక బౌల్లో వేసి బాగా మిక్స్ చేసి, అందులోనే చికెన్ ముక్కలు కూడా వేసి బాగా మిక్స్ చేసి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.
3. అంతలోపు, డ్రై రోస్ట్ కోసం సిద్దం చేసుకొన్న పదార్థాలన్నింటి, లైట్ గారోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
4. తర్వాత ముందుగా నానబెట్టుకొన్న బాదంను మిక్సీలో వేసి, కొద్దిగా నీళ్ళు పోసి, మెత్తని పేస్ట్ లా తయారుచేసి పెట్టుకోవాలి.
5. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి అందులో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసి 5-10మీడియం మంట మీద వేగించుకోవాలి.
6. ఉల్లిపాయ ముక్కలు, గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి మారగానే, స్టౌ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
7. పూర్తిగా చల్లారిన తర్వాత ఉల్లిపాయ, వెల్లుల్లితో పాటు ముందుగా రోస్ట్ చేసుపెట్టుకొన్న పదార్థాలు కూడా వేసి, కొద్దిగా నీరుపోసి మెత్తగా పేస్ట్ తయారుచేసుకోవాలి.
8. తర్వాత గిన్నెలో సరిపడా నూనె వేసి వేడయ్యాక అందులో ముందుగా మ్యారినేట్ చేసిన పెట్టుకొన్న చికెన్ ముక్కలు వేసి 10నిముషాలు వేగించుకోవాలి.
9. తర్వాత మిక్సీలో పేస్ట్ చేసుకొన్న మసాలా ముద్దను కూడా వేసి మరో 5-10తక్కువ మంట మీద వేగించుకోవాలి.
10. తర్వాత టమటో గుజ్జును కూడా అందులో వేసి, 3-4నిముషాలు వేగించుకోవాలి.
11. ఇప్పుడు అందులో ఉప్పు, కారం, బాదం పేస్ట్ కూడా వేసి మరో 5-6 నిముషాలు వేగించుకోవాలి.
12. తర్వాత అందులో సరిపడా నీళ్ళు పోసి 20నిముషాలు పాటు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.
13. చికెన్ ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత కొత్తిమీర తరుగుతో గార్నిస్ చేసి క్రిందికి దింపుకోవాలి.
సర్వ్ చేయడానికి క్రీమీ అండ్ స్పైసీ ముర్గ్ ముస్లం రెడీ. ఈ స్పైసీ చికెన్ రిసిపి వేడి వేడి అన్నం లేదా రోటీతో సర్వ్ చేయవచ్చు..



Click it and Unblock the Notifications











