Latest Updates
-
మాతృ దినోత్సవం రోజున భార్య, అమ్మ మధ్య నలిగిపోతున్నారా? ఈ చిన్న ట్రిక్ పాటిస్తే గొడవలు ఉండవు! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణులు, పీరియడ్స్‌లో ఉన్న మహిళలు ఈ విషయాలు తెలియకపోతే ప్రమాదమే! -
విడాకుల కోసం కోర్టుకు వెళ్తున్నారా? ఏపీ హైకోర్టు తీసుకున్న ఈ కొత్త నిర్ణయం మిమ్మల్ని షాక్‌కు గురి చేస్తుంది! -
ఎండలు మండుతున్నాయి.. అకస్మాత్తుగా పిడుగులు పడతాయా? మీ కుటుంబం కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
మీ భోజనం రుచిని రెట్టింపు చేసే సీక్రెట్ పచ్చిమిర్చి పచ్చడి..అప్పటికప్పుడు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మే 8: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది.. ధనలాభం ఖాయం! -
గ్యాస్, అసిడిటీకి చెక్..పడుకునే ముందు ఇదొక గ్లాస్ తాగితే కడుపు ఉబ్బరం మాయం! -
మే 8న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన వర్షమే! -
గుజరాతీ స్పెషల్ జొన్న ఖీచూ..బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్లకు సూపర్! -
అన్నమయ్య 618వ జయంతి వేడుకలు: భక్తుల పరవశం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. ఈ విశేషాలు తెలుసా?
మటన్ బగారా

బియ్యం : 1/2kg
మటన్ : 1/2kg
కారం : 2tsp
ఉల్లిపాయలు : 2
పెరుగు : 2cup
కొత్తిమీర : 1cup
పుదీనా : 1 cup
పాలు : 1/2 cup
సాజీరా: 25grm
లవంగాలు : 25grm
గరంమసాలా : 50grm
యాలకులు : 25 grm
కుంకుమ పువ్వు: 1tsp
దాల్చిన చెక్క: 25grm
పచ్చి మిరప పేస్ట్ : 2tsp
అల్లంవెల్లుల్లి పేస్టు : 2tsp
నిమ్మరసం : 1tsp
ఉప్పు : రుచికి సరిపడా
నూనె: 1tbsp
నెయ్యి: 4tsp
తయారుచేయు విధానం:
1. ముందుగా బియ్యాన్ని కడిగి నానబెట్టాలి.
2. మటన్‌ను శుభ్రంగా కడిగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయ పేస్టును పట్టించాలి. కొద్దిగా ఉప్పు, గరంమసాలా పొడి కూడా వేసి కలుపుకోవాలి.
3. తరువాత ఉల్లిపాయ ముక్కలు, కారం, కొద్దిగా నిమ్మరసం, యాలకులు, సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు వేసి పక్కన పెట్టుకోవాలి.
4. అరగంట తరువాత పెరుగు, కొత్తిమీర, పుదీనా వేసి ఉడికించుకోవాలి. పాలలో కుంకుమ పువ్వు వేసి పక్కన పెట్టుకోవాలి.
5. మరొక పాత్రలో నూనె వేసి వేడి అయ్యాక అల్లం వెల్లుల్లిపేస్టు, నిమ్మరసం, గరంమసాలా పొడివేసి కలియబెట్టాలి. నాలుగు కప్పుల నీటిని పోసి మరిగాక బియ్యం వేసుకోవాలి. అన్నం పలుకుగా ఉండగానే వార్చాలి.
6. ఇందులో ముందుగా ఉడికించిన మటన్, కుంకుమ పువ్వు కలిపిన పాలు పోసుకుని కలుపుకోవాలి. చివరగా పైన నెయ్యి వేసి దింపుకోవాలి. కొత్తమీర, ఉల్లిపాయలతో గార్నీష్ చేయాలి అంతే మటన్ బగారా రెడీ.



Click it and Unblock the Notifications