Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
మటన్ దాల్ మస్కా-రంజాన్ స్పెషల్
రంజాన్ మాసం వచ్చేసింది. సాయంత్రం వేళ బయటికి వెళితే హలీం ఘుమఘుమలు ముక్కుల్ని అదరగొట్టేస్తున్నాయి. ముస్లింలు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం అయ్యాక ఇష్టపడి తినే వంటలు కొన్ని ఉన్నాయి. కర్జ్జూరాలతో రోజాని విడిచాక హలీం లేదా చికెన్ టిక్కా, బోటి కబాబ్, అపొలో ఫిష్, ఆపై బిర్యానీ, ఫ్రూట్ సలాడ్... ఇలా సాగుతుంది వారి డిన్నర్. వీటిలోనే ఒకటి ప్రత్యేకమైనది మటన్ దాల్ మస్కా. చాలా టేస్టీగా ఉంటుంది.
కావల్సిన పదార్థాలు:
మటన్: 300grms
సెనగపప్పు: 50grms
గోధుమరవ్వ: 100grms
పచ్చిమిర్చి: 6-8
ఉల్లిపాయలు: 1/2kg
పెరుగు: 1cup
వెన్న: 5tsp
పెసరపప్పు: 50grms
బియ్యం: 100grms
కారం: 1tsp
గరం మసాలా: 1/2tsp
పుదీనా: 2కట్టలు
కొత్తిమీర: 1కట్ట
నిమ్మకాయలు: 2
నూనె: వేయించడానికి సరిపడా
అల్లం వెల్లుల్లిపేస్ట్: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక బాణలిలో నూనె వేసి, వేడయ్యాక అందులో సన్నగా తరిగి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఎర్రగా వేయించి తీయాలి.
2. తర్వాత అదే బాణలిలో నూనె వంపేసి కొద్దిగా ఉంచాలి. అందులో మంటన్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలావేసి కలపాలి.
3. తర్వాత పెరుగు కూడా వేసి మటన్ ముక్కలు మెత్తగా అయ్యే వరకూ సన్నని మంట మీద ఉడికించాలి. తర్వాత 6గ్లాసుల నీళ్ళు పోయాలి.
4. నీళ్ళు బాగా మరిగిన తర్వాత అందులోనే బియ్యం, గోధుమరవ్వ, సెనగపప్పు, పెసరపప్పు కూడా వేసి బాగా ఉడికించాలి.
5. చివరగా ఉప్పు సరిచూసి పప్పు గుత్తితో మెత్తగా మెదపాలి.
6. ఇప్పుడు దీని మీద వేయించిన ఉల్లిపాయ ముక్కలు, వెన్న, నిమ్మరసం, వేసి కలపాలి. అలాగే పుదీనా, కొత్తిమీర గార్నిష్ చేసి వేడి వేడిగా వడ్డించాలి.



Click it and Unblock the Notifications
