Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
మటన్ మునగకాయ మసాలా కర్రీ
Non Veg
oi-Saraswathi
By Sindhu

మటన్: 1/2kg
మునగకాయలు: 4-6
టమాటాలు: 2మీడియం సైజు
ఉల్లిపాయ: 2
కరివేపాకు: 2రెబ్బలు
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 2tbsp
పసుపు: 1/4tsp
కారం: 2tbsp
కొబ్బరి పేస్ట్: 2tbsp
చెక్కా, లవంగం పొడి: 1tsp
యాలకులపొడి: 1/2tsp
ఉప్పు: రుచికి తగినంత
గరం మసాలా పొడి: 1 tsp
నూనె: కావలసినంత
1. మునగకాయలు రెండంగుళాల ముక్కలుగా కట్ చేసుకుని అక్కడక్కాడా పొట్టు తీసి పెట్టుకోవాలి.
2. ప్యాన్ లో నూనె వేడిచేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి మెత్తబడేవరకు వేయించాలి. ఇప్పుడు కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కొద్దిసేపు వేయించాలి.
3. తర్వాత కారంపొడి, కొబ్బరి పేస్ట్, చెక్కాలవంగం, యాలకులపొడి వేసి కలపాలి. తర్వాత శుభ్రం చేసుకున్న మాంసం ముక్కలను, తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి. మూత పెట్టి నీరంతా ఇగిరిపోయేవరకు వేగనివ్వాలి.
4. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాట ముక్కలు కూడా వేసి మెత్తబడేవరకు వేయించి సరిపడా నీళ్లు పోసి కలిపి మూతపెట్టాలి. నిదానంగా మాంసం ముక్కలు ఉడకనివ్వాలి. తర్వాత మునగకాయ ముక్కలు వేసి మరో 10-15 నిమిషాలు ఉడకనిచ్చి, నూనె తేలినతర్వాత గరం మసాలా పొడి కలిపి దింపేయాలి. అంతే మటన్ మునగకాయ మసాల రెడీ...
Comments
Read more about: mutton mutton drumstick masala recipe non vegetarian మటన్ మటన్ మునగకాయ మసాల వంటకం మాంసాహారం
English summary
Mutton Drumstick Masala curry | మటన్ మునగకాయ మసాలా కర్రీ
Story first published: Saturday, February 11, 2012, 17:07 [IST]
Other articles published on Feb 11, 2012



Click it and Unblock the Notifications