Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
మటన్ ఖీమా విత్ ‘పక్కి పలావ్’

బాస్మతి బియ్యం - 1/2 kg
మటన్ ఖీమా - 1/4 kg
ఉల్లిపాయలు- 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 3 tsp
కారం - 1 tsp
జీలకర్ర - 1/2 tsp
పెరుగు - 1 cup
టొమోటోలు.- 4
గరంమసాలా - 1/2 tsp
నిమ్మకాయ రసం -2 tsp
పచ్చిబఠాణీ - 1/2 cup
పుదీనా - 1/2 cup
కొత్తిమీర - 1/2 cup
డాల్డా -50 grm
ఉప్పు - రుచికితగినంత
నూనె - తగినంత
తయారు చేయు విధానం :
1. ఖీమాలో తగినన్ని నీళ్లుపోసి ఇమిరిపోయేదాకా ఉడికించాలి.
2. పాన్‌లో నూనె వేసి కాగాక సన్నగ తరిగిన ఉల్లిపాయలు వేసి ఎర్రగా వేయించాలి. తర్వత అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు వేసి వేయించాక ఖీమా, టొమోటో ముక్కలు వేసి బాగా ఉడికించి కూరలా తయారు చేయాలి.
3. ఇప్పుడు పెరుగు, గరంమసాలా, ఉప్పు, కారం కూడా జత చేసి ఉడికించి దించేయాలి.
4. వేరే గిన్నెలో ఎసరుపోసి అందులో ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కడిగిన బియ్యంపోసి మూడువంతులు ఉడికించి వార్చాలి.
5. మరొక గిన్నెలో అడుగున డాల్డా వేసి సగం అన్నం వేసి పరచినట్లు చేయాలి. తరువాత దానిపై ఖీమా కూర, విడిగా ఉడికించి పెట్టుకున్న బఠాణీలను వేసి ఆపై మిగిలిన అన్నం, మిగిలిన ఖీమా కూరను వేయాలి.
6. ఫైనల్ గా అన్నంపైన నిమ్మరసం, కొత్తిమీర పుదీనాలను చల్లాలి. మిగిలిన డాల్డాను కూడా అన్నంపైన చల్లి సిమ్‌లో పెట్టి దమ్ చేస్తే పూర్తిగా ఉడికితే అదే మటన్ ఖీమా విత్ 'పక్కి పలావ్" రెడీ. ఉల్లిపాయలు, టమోటోలతో వేడి వేడిగా సర్వ్ చేయాలి.



Click it and Unblock the Notifications