Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
మటన్ పులావ్

మటన్ : 1kg
బియ్యం: 1kg
ఉల్లిపాయలు: 2
పచ్చిమిర్చి: 8
జీడిపప్పు : 10
నెయ్యి: 1/2cup
కొత్తిమీర : రెండు కట్టలు
లవంగాలు : 8
యాలకులు: 4
వెల్లుల్లి ముద్ద : 2tsp
అల్లం : చిన్న ముక్క
దాల్చిన చెక్క : 1
గసగసాలు : 50grms
ధనియాలు : 50grms
పలావు ఆకులు : 10grms
మరాటీ మొగ్గ :10grms
కొబ్బరికాయ : 1
నిమ్మకాయలు : 4
పుదీనా : ఒక కట్ట
ఉప్పు : రుచికి సరిపడా
పెరుగు : 1cup
తయారు చేయు విధానం :
1. పచ్చి మిర్చి, గసగసాలు, అల్లం, ధనియాలు వీటిని విడివిడిగా మెత్తగా నూరాలి, కొబ్బరి తురిమి పాలు తీసుకోవాలి, ఉల్లిపాయలను నిలువుగా తరిగిపెట్టుకోవాలి.
2. మటన్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెరుగు, నిమ్మకాయ రసం, తగినంత ఉప్పు, ముందుగా నూరిపెట్టుకున్న వాటిలో సగాన్ని, నూరిపెట్టుకున్న అల్లంవెల్లులిలో సగాన్ని వేసి బాగా కలిపి ఒక దళసరి గిన్నెను స్టవ్ మీద పెట్టి నెయ్యి పోసి బాగా కాగిన తరువాత అందులో అన్ని కలిపిన మటన్ ను వేసి నీరు అంతా ఎగిరిపోయే దాక ఇగర బెట్టాలి.
3. ఇప్పడు మరొక పెద్ద బాణలి తీసుకుని అందులో నెయ్యి వేసి పొయ్యి మీద పెట్టి అందులో ఉల్లిపాయలు వేసి దోరగా వేయించాలి.
4. తర్వాత అందులోనే చెక్క, లవంగాలు, జీడిపప్పు, మరాటీ మొగ్గ, పలావు ఆకు, వేసి కాసేపు వేగనిచ్చి, మిగిలిన అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి కొంత సేపు వేగాక అందులో అరలీటరు కొబ్బరి పాలు, లీటరు నీళ్ళు కొలిచి పోసుకోవాలి.
5. ఇందులోనే పుదీనా, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి బాగా మరగనిచ్చి ఎసరు మరిగేటప్పుడు కడిగివుంచుకున్న బియ్యాన్ని కూడా వేయాలి.
6. అన్నం ఉడుకుతుండగా ముందుగా ఉడికించి ఉంచుకున్న మటన్ ను కూడా అందులో వేసి బాగా కలబెట్టి మూత పెట్టాలి.
7. తరువాత అది బాగా మగ్గాక పది నిమిషాలు వుంచి దింపేయాలి. దీనికి పెరుగు చట్నీ గాని, కుర్మా గాని మంచి కాంబినేషన్.



Click it and Unblock the Notifications