Latest Updates
-
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా!
నవాబ్ బిర్యాని

చికెన్: 1kg
బియ్యం: 11/2 cup
యోగర్ట్: 2 cups
పెరుగు: 1 cup
పాలు:1cup
మిరియాలు: 10
లవంగాలు: 8
పుదీనా: 1/2 cup
యాలకలు: 5
ఉల్లిపాయలు: 4
కొత్తిమీర: 1/2cup
బాదం: 1/2 cup
అల్లం, వెల్లుల్లి పేస్ట్: 3tbsp
కారం:2 tsp
గరం మసాలా పౌడర్: 1tsp
షాజిర మరియు జీలకర్ర: 1tsp
పసుపు: 1tsp
కుంకుమపువ్వు: 1/2tsp
ఉప్పు: రుచికి సరిపడ
ఆయిల్: తగినంత
తయారు చేయు విధానము:
1. ముందుగా ఒక గిన్నె లోనికి చికెన్ ముక్కలు తీసుకొని అందులో అల్లంవెల్లుల్లి పేస్ట్, ఉప్పు మరియు యోగర్ట్ వేసి బాగా కలిపి ఒక గంట సేపు నాననివ్వాలి.
2. స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో అరకప్పు ఆయిల్ వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, షాజీర, లవంగాలు, యాలకలు, మిరియాలు, మరియు బాదం వేసి దోరగా వేగనివ్వాలి.
3. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకొన్న చికెన్ ముక్కలు, పసుపు, కారం, గరం మసాలా పౌడర్, మరియు కొద్దిగా నీళ్లు జత చేసి కొద్ది సేపు ఉడకనివ్వాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొన్న కొత్తిమీర, పొదీనా వేసి కలియబెట్టి ప్రక్కకు దింపుకోవాలి.
4. కుక్కర్ లో 1/4 నెయ్యి వేసి అందులో కడిగి అరగంట సేపు నానబెట్టిన బియ్యాని వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి తర్వాత బియ్యానికి 3 కప్పుల నీళ్లు పోసి సగభాగం ఉడకనివ్వాలి.
5. పాన్ లో 114 నెయ్యి వేసి వేడయ్యాక కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించి ప్రక్కకు తీసి పెట్టుకోవాలి.
6. తర్వాత పెద్ద పాన్ తీసుకొని అందులో మొదటగా సగం ఉడికిన అన్నాన్ని క్రింది బాగంలో పరచాలి. తర్వాత ఫ్రై చేసిని ఉల్లిపాయలను మరియు కుంకుమ పువ్వు అమర్చాలి. దాని మీదగా చికెన్ మిశ్రమాన్ని అమర్చాలి. ఆ తర్వాత మొదట అమర్చినట్టుగా పైన కూడ అమర్చాలి. గట్టిగా మూత పెట్టి తక్కువ మంట మీద ఆవిరిలో ఉడకనివ్వాలి. అంతే కలర్ కలర్ నవాబి బిర్యాని సర్వ్ చేయడానికి సిద్దం.



Click it and Unblock the Notifications