టేస్టీ --బెంగాలీ చికెన్

బెంగాలీ రుచులు చాలా టేస్టీగా ఉంటాయి. సాదారణంగా చికెన్ తో వివిధ వెరైటీలను తయారు చేస్తారు. కొన్ని ఇండియన్ చికెన్ వంటలు గ్రేవీలా..మరికొన్ని ఫ్రై లా ఉంటాయి. చాలావరకూ మన ఇండియన్ టేస్ట్ కు తగ్గట్టు చికెన్ కర్రీలను స్పైసీగా వండుతుంటారు. అయితే బెంగాలీ చికెన్ నాన్ స్పైసీ చికెన్ డిష్. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ కలిగి ఉంటుంది.

బెంగాలీ చికెన్ పెద్దలు మాత్రమే కాదు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ డిఫ్ ఎలా తయారు చేయాలో చూద్దాం...

Non-Spicy Bengali Chicken Jhol

కావల్సిన పదార్థాలు:
చికెన్: 500 grams(మీడియం సైజ్ లోకి కట్ చేసుకోవాలి)
బంగాళదుంప: 3 (పొట్టతీసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి)
ఉల్లిపాయ: 1 (సన్నగా కట్ చేసుకోవాలి) + 1 (cut into quarters)
వెల్లుల్లి: 8 pods
అల్లం: 1చిన్న ముక్క (chopped)
పచ్చిమిర్చి: 3 (మద్యకు కట్ చేసుకోవాలి)
టమోటో: 1 (సన్నగా కట్ చేసుకోవాలి)
కొత్తిమీ: 2stalks (chopped)
పసుపు: ½ tsp
జీలకర్ర: ½ tsp
కారం: ½ tsp
జీలకర్రపొడి: 1tsp
ధనియాల పొడి: 1tsp
మిరియాలు: 5
చెక్క: 1 inch
లవంగాలు: 3
యాలకులు: 2
బిర్యాని ఆకు: 1
ఆవనూనె: 3tbsp
ఉప్పు: రుచికి సరిపడా

తయారు చేయు విధానం:
1. చికెన్ కు ఉప్పు పట్టించి పది నిముషాలు పక్కన పెట్టుకోవాలి.
2. అంతలోపు మిరియాలు, లవంగాలు, చెక్క, యాలకులు కొద్దిగా నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి.
3. ఇప్పుడు ఒక ఉల్లిపాయ తీసుకొని, వెల్లుల్లి మరియు అల్లం పేస్ట్ చేసుకోవాలి.
4. కుక్కర్ లో నూనె వేసి వేడి చేసి అందులో బంగాళదుంప ముక్కలు వేసి మీడియం మంట మీద రెండు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
5. వేయించిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి.
6. ఇప్పుడు అదే నూనెలో బిర్యాని ఆకు, జీలకర్ర వేసి వేగించుకోవాలి.
7. 1నిముషం తర్వాత అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి తక్కువ మంటమీద వేగించకోవాలి.
8. ఇప్పుడు ఇందులో చికెన్ ముక్కలు కూడా వేసి 5నిముషాల పాటు వేగించుకోవాలి.
9. చికెన్ ముక్కలు బ్రౌన్ కలర్ కు మారగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ మసాల మిశ్రమంతో చికెన్ బాగా కలగలిసేలా వేగించుకోవాలి.
10. ఇప్పుడు అందులో టమోటోముక్కలు వేసి, తర్వాత ఉప్పు, కారం, జీలకర్ర, ధనియాల పొడి, పసుపు పొడి వేసి 2-3నిముషాలు బాగా వేగించుకోవాలి.
11. టమోటో మెత్తబడ్డాక రెండు కప్పుల నీళ్ళు పోసి ఫ్రై చేసుకొన్న బంగాళదుంపను కూడా వేసి కుక్కర్ మూత పెట్టి, చికెన్ ను రెండు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి.
12. ఇప్పుడు నీటిలో నానబెట్టుకొన్నమసాలాలను తీసుకొని పొడిచేసుకోవాలి.(కచపచ దంచుకోవాలి).
13. చికెన్ ఉడికి విజిల్ వచ్చిన తర్వాత క్రష్ చేసుకొన్న గరం మసాలను చిలకరించి గార్నిష్ చేసి, కొత్తిమీరతో గార్నిచేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే బెంగాలీ చికెన్ రెడీ...

Story first published: Friday, April 19, 2013, 17:04 [IST]
Desktop Bottom Promotion