Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
మైదా పడదు, టేస్ట్ తగ్గదు.. ఇంట్లోనే ఈజీగా హై ప్రొటీన్ పనీర్ మఖానీ పిజ్జా ఎలా చేసుకోవాలంటే..
వీకెండ్ రాగానే లేదా సాయంత్రం కాగానే ఏదైనా రుచికరమైన ఫుడ్ తినాలనిపిస్తుంది. అందులోనూ పిజ్జా పేరు చెబితే చాలు, ఎవరికైనా నోరూరాల్సిందే. కానీ బయట దొరికే మైదాతో చేసిన పిజ్జాలు మన ఆరోగ్యానికి అంత మంచివి కావు. అలాగని పిజ్జా తినకుండా మనసును చంపుకోనవసరం లేదు. డైట్ చేసే వారికి, జిమ్ కి వెళ్లే వారికి, అలాగే పిల్లలకి ఎంతో ఆరోగ్యకరమైన, రుచికరమైన హై ప్రొటీన్ పనీర్ మఖానీ పిజ్జా ఇంట్లోనే చాలా తక్కువ శ్రమతో తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ పిజ్జా రుచి చూశారంటే, ఇకపై ఎప్పటికీ బయట ఆర్డర్ చేయరు.

పనీర్ మఖానీ పిజ్జా తయారీకి కావలసిన పదార్థాలు
ఓట్స్ పిండి - అర కప్పు
గోధుమ పిండి - పావు కప్పు
కార్న్ ఫ్లోర్ - 1 టేబుల్ స్పూన్
గట్టి పెరుగు- 75 గ్రాములు
ఉప్పు - తగినంత
పంచదార - చిటికెడు
నీళ్లు - తగినంత
నూనె - 1 టీస్పూన్
టమాటాలు - 2
వెల్లుల్లి రెబ్బలు - 3
కాశ్మీరీ కారం - 1 టీస్పూన్
ఉప్పు,చిల్లీ ఫ్లేక్స్,ఆరెగానో - రుచికి సరిపడా
పనీర్ - 30 గ్రాములు
పనీర్ - 100 గ్రాములు
క్యాప్సికమ్ - కొద్దిగా
ఉప్పు - చిటికెడు
లో ఫ్యాట్ మోజరెల్లా చీజ్ -20 గ్రాములు

పనీర్ మఖానీ పిజ్జా తయారీ విధానం
-ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో ఓట్స్ పిండి, గోధుమ పిండి, కార్న్ ఫ్లోర్, ఉప్పు, చిటికెడు పంచదార వేసి బాగా కలపండి. ఇప్పుడు అందులో 75 గ్రాముల గట్టి పెరుగు వేసి, అవసరమైతే కొద్దిగా నీళ్లు చల్లుతూ పిండిని మృదువైన ముద్దలా కలుపుకోవాలి. దీన్ని ఒక 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టండి.
-ఆ తర్వాత పిండిని గుండ్రంగా, పిజ్జా బేస్ లాగా ఒత్తుకోవాలి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని, ఈ బేస్ ని రెండు వైపులా దోరగా కాల్చుకుని పక్కన పెట్టుకోండి.
-ఒక చిన్న పాన్ లో ఒక టీస్పూన్ నూనె వేడి చేసి, అందులో వెల్లుల్లి రెబ్బలు, తరిగిన టమాటాలు వేసి మగ్గనివ్వండి. అందులోనే కశ్మీరీ కారం, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, ఆరెగానో వేసి టమాటాలు మెత్తబడే వరకు ఉడికించండి. చల్లారాక ఈ మిశ్రమాన్ని ఒక బ్లెండర్ లో వేసి, దానికి 30 గ్రాముల పనీర్ జతచేసి మెత్తని క్రీమీ సాస్ లా మిక్సీ పట్టుకోవాలి. పనీర్ వేయడం వల్ల ఈ సాస్ కి మంచి ప్రొటీన్ తో పాటు అద్భుతమైన టెక్స్చర్ వస్తుంది.
-అదే పాన్ లో 100 గ్రాముల పనీర్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి, చిటికెడు ఉప్పు, పెరి పెరి సీజనింగ్ చల్లి లేత బంగారు రంగు వచ్చే వరకు దోరగా వేయించి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు ముందుగా కాల్చి పెట్టుకున్న పిజ్జా బేస్ పైన, తయారు చేసుకున్న క్రీమీ పనీర్ సాస్ ను సమానంగా రాయండి. దానిపైన వేయించిన పనీర్ క్యాప్సికమ్ ముక్కలను అందంగా అమర్చండి. చివరగా 15-20 గ్రాముల లో ఫ్యాట్ మోజరెల్లా చీజ్ ను పైన చల్లండి.
-ముందుగానే 180 డిగ్రీల వద్ద ప్రీ హీట్ చేసి పెట్టుకున్న ఓవెన్ లో ఈ పిజ్జాను పెట్టి, కచ్చితంగా 10 నిమిషాల పాటు బేక్ చేయండి. అంతే వేడివేడిగా, గుమగుమలాడే హై ప్రొటీన్ హోమ్ మేడ్ పిజ్జా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications