Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
వేప ఆకుల నీటితో స్నానం చేస్తే జరిగే అద్భుతాలు ఏంటో తెలుసా?
ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన ఔషధ వృక్షాల్లో వేప చెట్టు ముందు వరుసలో ఉంటుంది. మన భారతీయ సంప్రదాయంలో, ఆయుర్వేదంలో వేపకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. వేప ఆకుల నుండి బెరడు, పుల్లల వరకు ప్రతి ఒక్కటీ ఔషధాల గని లాంటిదే. ఖరీదైన సబ్బులు, షాంపూల వెనుక పరుగులు తీసే ఈ రోజుల్లో సహజసిద్ధమైన వేప ఆకులను నీటిలో బాగా మరిగించి, ఆ గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల మన ఆరోగ్యానికి, అందానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి.

వేపలో సహజసిద్ధమైన యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబయల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. రోజువారీ జీవితంలో వేప నీటి స్నానం చేయడం వల్ల కలిగే ఆమోఘమైన లాభాలు ఏమిటో ఇక్కడ చూడండి.
శరీర దుర్వాసనకు చెక్
ఎక్కువగా చెమట పట్టే సమయంలో శరీర దుర్వాసన అనేది మనల్ని, మన చుట్టుపక్కల వారిని తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తుంది. ఖరీదైన పర్ఫ్యూమ్‌లు వాడినా అది తాత్కాలికమే. శరీర దుర్వాసనకు అసలు కారణం చర్మంపై చేరే బ్యాక్టీరియా. వేప నీటితో స్నానం చేయడం వల్ల అందులోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఆ బ్యాక్టీరియాను సమూలంగా నాశనం చేస్తాయి. దీనివల్ల మీరు రోజంతా ఎలాంటి దుర్వాసన లేకుండా తాజాగా ఉండగలుగుతారు.
చర్మానికి రక్షక కవచం
చర్మ సౌందర్యాన్ని, ఆరోగ్యాన్ని కాపాడటంలో వేప అద్భుతంగా పనిచేస్తుంది. వేపలోని యాంటీ మైక్రోబయల్ గుణాలు చర్మానికి ఒక రక్షక కవచంలా నిలుస్తాయి. మన ఇళ్లలో ఎవరికైనా అమ్మవారు (ఆటలమ్మ లేదా చికెన్ పాక్స్) వచ్చినప్పుడు, తగ్గే దశలో వేప ఆకులు వేసి కాచిన నీటితో స్నానం చేయించడం మనకు ఆనవాయితీ. దీనికి కారణం వేపలోని ఇన్ఫెక్షన్లను నాశనం చేసే గుణమే.
అంతేకాదు కాలుష్యం వల్ల వచ్చే మొటిమలు, బ్లాక్ హెడ్స్, మచ్చలు వంటి చర్మ సమస్యలకు వేప నీరు చక్కటి పరిష్కారం. చర్మంపై ఉన్న గాయాలు, పుండ్లు త్వరగా మానడానికి కూడా ఇది ఎంతో సహాయపడుతుంది.

పట్టుకుచ్చు లాంటి జుట్టు కోసం
కేశాల ఆరోగ్యానికి వేప నీరు ఒక దివ్యౌషధం. చుండ్రు సమస్యతో బాధపడేవారికి ఇది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. తలస్నానం చేసేటప్పుడు వేప నీటిని ఉపయోగించడం వల్ల, అది మాడు మీద ఉన్న సూక్ష్మ చర్మ రంధ్రాలను లోతుగా శుభ్రపరుస్తుంది. దీనివల్ల చుండ్రుకు కారణమయ్యే ఫంగస్ నశించిపోతుంది.
కెమికల్స్ ఉండే షాంపూల కంటే వేప నీటితో జుట్టును కడగడం వల్ల వెంట్రుకలు రాలడం తగ్గి, కేశాలు మరింత మృదువుగా, నిగనిగలాడుతూ పట్టుకుచ్చులా తయారవుతాయి.
కంటి ఆరోగ్యానికి సంజీవని
కంటి సమస్యలకు కూడా వేప నీరు మంచి ఔషధంగా పనిచేస్తుంది. వేప నీటిలో ఉండే క్రిమిసంహారక గుణాలు కంటికి సంబంధించిన ఇన్ఫెక్షన్లను రాకుండా అడ్డుకుని, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా కండ్లకలక వచ్చినప్పుడు వేప ఆకులను మరిగించి, చల్లార్చిన నీటితో కళ్లను సున్నితంగా కడుక్కోవడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
