Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
క్విక్ అండ్ ఈజీ బటర్ చికెన్ రిసిపి
కొన్ని వంటలు మనం మాటల్లో చెప్పలేనంత రుచిగా ఉంటాయి. అటువంటి వంటకాల్లో ఉదాహరణకు బట్టర్ చికెన్ ఒకటి. ఈ ఇండియన్ బట్టర్ చికెన్ ను బ్రిటీష్ వారు కూడా తిని తెగ ఎంజాయ్ చేశావారట, అంతటి అద్భుత రుచికలిగినది. అదే విధంగా చికెన్ బటర్ మసాలా రిసిపి కూడా మరింత ఎక్కువ మందికి అత్యంత ఇష్టమైన వంట.
సహజంగా ఇండియన్ చికెన్ కర్రీకీ బటర్ ను ఉపయోగిస్తుంటారు బటర్ చికెన్ లాగా ఇది స్పైసీగా లేదా తక్కువ కారంతో ఉండదు. అయితే ఇది బటర్ ప్లేవర్ ను అందిస్తుంది. టమోటో గుజ్జు జోడించడం వల్ల రెడ్ కలర్ లో స్పైసీగా నోరూరిస్తుంటుంది. కారం ఎక్కువగా తినాలనుకొనే వారు, మీకు అవసరం అయినంత కారం జోడించుకోవచ్చు. స్పైసీ బటర్ చికెన్ ఎంజాయ్ చేయవచ్చు. ఈ బటర్ చికెన్ రిసిపిని ఇంట్లో కూడా తయారుచేసుకోవచ్చు. మరి ఈ వంటను ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
చికెన్: 500gms (ఎముకలేది)
ఉల్లిపాయలు: 4
టమోటాలు: 3
అల్లం-వెల్లుల్లి పేస్ట్: 1tbsp
పసుపు పొడి: 1tsp
కారం పొడి: 1tsp
ధనియా (ధనియా) పొడి: 1tsp
కసూరి మెంతి (ఎండిన మెంతిలు ఆకులు): 1tbsp
ఉప్పు: రుచికి సరిపడా
టమోటో సాస్: 1tbsp
బట్టర్: 2tbsp
కొత్తిమీర తరుగు: 2tbsp (అలంకరించుట కోసం)
వార్మ్ వాటర్: 1
తయారుచేయు విధానం:
1. ముందుగా ఉల్లిపాయను మిక్సీ జార్ లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
2. తర్వాత టమోటోలను కూడా మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ లో బట్టర్ వేసి హీట్ చేయాలి, అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. మీడియం మంట మీద 5 నిముషాలు బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.
5. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత అందులో చికెన్ ముక్కలు వేసి మరో 5నిముషాలు వేగించుకోవాలి.
6. 5నిముషాలు చికెన్ ముక్కలు వేగిన తర్వాత అందులో టమోటో గుజ్జు, పసుపు, కారం, ధనియాలపొడి, ఉప్పు వేసి మరో 5నిముషాలు ఉడికించుకోవాలి.
8. ఇప్పుడు అందులో టమోటో సాస్ మరియు డ్రై మేతి లీవ్స్ కూడా వేసి బాగా మిక్స్ చేస్తూ ఉడికించాలి.
9. తర్వాత అందులో వార్మ్ వాటర్ పోసి, మొత్తం కలగలిపి, మూత పెట్టి, చికెన్ ముక్కలు మెత్తబడే వరకూ మీడియం మంట మీద ఉడికించుకోవాలి.
10. మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించి, తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. కుక్కర్ లో ఆవిరి మొత్తం తగ్గే వరకూ అలాగే ఉంచి, కొద్దిసేపటి తర్వాత మూత తీసి చికెన్ మొత్తం ఉడికిందో లేదో తెలుసుకోవాలి.
11. ఇప్పుడు బటర్ చికెన్ కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే బటర్ చికెన్ రెడీ. ఈ రుచికరమైన బటర్ చికెన్ రైస్ లేదా పరోటాలకు చాలా బాగుంటుంది.



Click it and Unblock the Notifications