Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
షహీ చికెన్ కుర్మా: రంజాన్ స్పెషల్
ప్రస్తుతం రంజాన్ సీజన్. ఈ నెలలో మేము మీకోసం వివిధ రకాల మాంసాహార వంటలను పరిచయం చేస్తున్నాము. ఇవి చాలా డిఫరెంట్ రుచిని కలిగి ఉంటాయి. వివిధ మాంసాహార వంటల్లో షహీ చికెన్ రిసిపి కూడా ఒకటి . ఇది ఒక రాయల్ కిచెన్ వంట, ఇది నిజామ్ ల కాలం నాటి అద్భుతమైన రుచికరమైన వంటి. షహీ చికెన్ కుర్మాను ప్రతి ఒక్కరూ ఇంట్లో చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు.
ఈ రంజాన్ సీజన్ లో దాదాపు అందరు ముస్లీముల ఇల్లలోనూ చికెన్ కుర్మాను వండుతారు. మరి ఈ ఇప్తార్ మీల్ కు మీరు కూడా ఒక అద్భుతమైన రుచికలిగి రాయల్ వర్షన్ వంటను రుచి చూడాలంటే తయారుచేయు విధానం తెలుసుకోవాల్సిందే.

కావల్సిన పదార్థాలు:
చికెన్: 1kg
పెరుగు: 2cups
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tbsp
కారం: 2tsp
పసుపు: 1tsp
గరం మసాలా పొడి: 2tsp
నిమ్మరసం 4tbsp
దాల్చిన చెక్క: 1
లవంగాలు: 2
యాలకలు: 2
మిరియాలు :4
కుంకుమపువ్వు: చిటికెడు
పచ్చిమిర్చి: 2 (చిన్నముక్కలుగా తరిగినవి)
ఉప్పు: రుచికి
నూనె: 4tbsp
కొత్తిమీర తరుగు: 2tbsp(గార్నిష్ కోసం సన్నగా తరిగినవి)
పుదీనా 1tbsp(గార్నిష్ కోసం సన్నగా తరిగినవి)
మసాలా పేస్ట్ కొరకు కావల్సిన పదార్థాలు:
ఉల్లిపాయలు: 2 (చిన్న ముక్కలుగా తరిగినవి)
బాదం: 10
జీడిపప్పు: 10
గసగసాలు: 2tbsp
కొబ్బరి: 2tbsp
తయారుచేయు విధానం:
1. ముందుగా చికెన్ ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత ఒక పాన్ లో ఉల్లిపాయముక్కలు, బాదం, జీడిపప్పు, గసగసాలు మరియు కొబ్బరితురుము వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
3. తర్వాత స్టౌ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
4. చల్లారిన తర్వాత వీటిని మిక్సీలో వేసి కొద్దిగా నీళ్ళు జోడించి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి .
5. అంతలోపు చికెన్ ముక్కలకు నిమ్మరసం, పెరుగు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి, మసాలా పేస్ట్, గరం మసాలా మరియు కుంకుమ పువ్వు వేసి, చికెన్ కు బాగా పట్టించాలి.
6. ఇప్పుడు ఈ పాన్ కు ఫోయిల్ పేపర్ తో మూర్తిగా పాన్ కు కవర్ చేసి, ఫ్రిజ్ లో 30నిముషాలు పెట్టుకోవాలి .
7. దాని తర్వాత, పాన్ లో కొద్దిగా నూనె వేసి దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బ్లాక్ పెప్పర్ కార్న్ వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి.
8. ఇప్పుడు అందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చికెన్ కూడా వేసి 15-20నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేయాలి.
9. 20నిముషాల తర్వాత అరకప్పు నీళ్ళు పోసి మూత పెట్టి, తక్కువ మంట మీద పూర్తిగా ఉడికించుకోవాలి.
10. పూర్తిగా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి కొత్తిమీర మరియు పుదీనాతో గార్నిష్ చేయాలి. అంతే షహీ చికెన్ కుర్మ రెడీ. దీన్ని రైస్ మరియు రోటీ, పరోటాలతో రంజాన్ సీజన్ ను ఎంజాయ్ చేయవచ్చు.



Click it and Unblock the Notifications