Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
మద్యహ్నా భోజనానికి స్పైసీ చేపల పులుసు
మాంసాహార ప్రియులకు చేపలంటే కూడా చాలా ఇష్టం. ముఖ్యంగా సముద్రతీర ప్రాంతాల్లో ఉండే వారు చేపలతో వివిధ రకాలుగా వెరైటీ వెరైటీ ఫిష్ వంటకాలను తయారు చేస్తుంటారు. చేపలు ఏవిధంగా వండినీ సూపర్ టేస్ట్ ఉంటుంది. చేపలను కర్రీ, ఫిష్ ఫ్రై, ఫిష్ కట్ లెట్, ఫిష్ స్నాక్స్ మొ... మీ ఆరోగ్యం కోసం ఏరకమైన చేపలైనా సరే ఎంపిక చేసుకోండి. ఎందుకంటే చేపలు ఏరకమైనా వాటిలో ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు విటమిన్స్ అధికంగా ఉండి ఆరోగ్యానికి అత్యధిక ప్రయోజనాన్ని చేకూర్చుతాయి.
ఫిష్ తో తయారుచేసే వంటలు ఎప్పటిలాగే రొటీన్ గా తయారుచేసుకోకుండా కొంచెం వెరైటీగా చాలా సులభంగా, ట్యాంగీ టేస్ట్ తో త్వరగా తయారుచేసుకొనే వంటి టామరిండ్(చింతపులుసు) ఫిష్ కర్రీ. స్పైసీ ఇండియన్ ఫిస్ కర్రీ ట్యాంగీ మరియు స్పైసీగా ఉంటుంది. ఇటువంటి స్పెషల్ వంటలను మద్యాహ్నాన లంచ్ కు ఇంట్లో ట్రై చేయడం వల్ల ఒక కొత్త రుచిని ఆస్వాధించవచ్చు. ఈ ఫిస్ కర్రీకి పుల్లని చింత పండు పులుసుతో పాటు కొన్ని ఇండియన్ మసాలా దినుసులతో పాటు, ప్రత్యేకంగా తయారుచేసుకొన్న మసాలా పేస్ట్ మిక్స్ చేయడం వల్ల ట్యాంగీ మరియు స్పైసీ టేస్ట్ కలిగి ఉంటుంది.

కావల్సిన పదార్థాలు:
ఫిష్(చేపలు): ½kg
చింతపండు: కొద్దిగా (నీటిలో నానబెట్టుకోవాలి)
పచ్చిమిర్చి: 4 (ముక్కలుగా కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయ: 1 (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
కారం: 1tbsp
నూనె: 3tbsp
పసుపు: 1 tsp
ఉప్పు : రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు: కొద్దిగా
ధనియాల పొడి: 1tbsp
జీలకర్ర పౌడర్: 1tsp
గసగసాలు పొడి: 1 tsp
యాలకులు: 3
లవంగము: 4
దాల్చిన: 2
వెల్లుల్లి: 1 tsp
కరివేపాకు: 3
తయారుచేయు విధానం :
1. ముందుగా గసగసాలు, యాలకలు, దాల్చిన చెక్క, లవంగాలు మరియు వెల్లుల్లి వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
2. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో శుభ్రం చేసి పెట్టుకొన్న చేపముక్కలు, పసుపు వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కారం, ధనియాలపొడి మరియు జీలకర్ర వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి.
3. ఇప్పుడు ఫిష్ బౌల్లో కొద్దిగా నూనె మరియు మొదట గ్రైండ్ చేసి పెట్టుకొన్న పేస్ట్ వేసి మొత్తాన్ని గ్రైండ్ చేసుకోవాలి.
4. ఇప్పుడు మంటను పూర్తిగా తగ్గించి, చేపముక్కలున్న బౌల్ పెట్టి మీడియం మంట మీద ఉడికించాలి. ఉడికే ముందుగానే కొద్దిగా ఉప్పు కూడా చేర్చి పెట్టుకోవాలి.
5. ఈ గ్రేవీ మరి చిక్కగా కాకుండా మీడియంగా ఉండేట్లు చూసుకోవాలి.
6. మూత పెట్టి, 10నిముషాలు అలాగే ఉంచి, 5 నిముషాల తర్వాత చేపలు మెత్గగా ఉడికిందని నిర్ధారించుకొన్న తర్వాత కరివేపాకు, చింతపులుసు పోసి ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే స్పైసీ అండ్ టేస్టీ మరియు హెల్తీ ఫిస్ కర్రీ రెడీ..



Click it and Unblock the Notifications